పవన్‌పై పృధ్వీరాజ్ ప్రశంసలు.. ట్రోల్స్ స్టార్ట్..

నిన్న మొన్నటి వరకూ మెగా ఫ్యామిలీపై తనదైన శైలిలో విరుచుకుపడిన ప్రముఖ నటుడు పృధ్వీరాజ్.. తాజాగా ప్లేటు ఫిరాయించారు. మెగా ఫ్యామిలీపై ప్రశంసలు కురిపించారు. తాజాగా ఆయన ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాజకీయాల కోసం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను విమర్శించాల్సి వచ్చింది తప్ప వేరే దురుద్దేశం లేదని తెలిపారు. చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్‌లను తాను నిందించడం రాజకీయాల కోసమే తప్ప వేరే దురుద్దేశం లేదని అన్నాడు. పృధ్వీరాజ్ 2019 ఎన్నికలకు ముందు సినిమాలకు బ్రేక్ ఇచ్చి రాజకీయాల్లోకి ప్రవేశించిన వెంటనే విశ్వరూపం చూపించారు. వైసీపీలో చేరి కీలక పదవిని దక్కించుకున్నారు.

ఆ తరువాత ఓ వివాదంలో చిక్కుకుని పార్టీ పదవిని కోల్పోయి..అటు రాజకీయ జీవితం దాదాపు ముగిసిపోయి.. ఇటు సినిమా అవకాశాలు రాక.. ఒకరకంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వైసీపీలో మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో పృధ్వీ జనసేనపై, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. మెగా అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. కాగా.. సినిమాల్లేక ఇబ్బంది పడుతున్న పృధ్వీకి ఇటీవల మెగాస్టార్ చిరంజీవే స్వయంగా ఆయనకు తన సినిమాలో ఛాన్స్ ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మళ్లీ అనేక సినిమా అవకాశాలు రావడం మొదలయ్యాయి. పవన్ కూడా తన సినిమాలో పృధ్వీని తీసుకున్నారు.

ఈ క్రమంలోనే పృధ్వీ తన పవన్‌పై తన వ్యాఖ్యల వెనుకన్న ఆంతర్యాన్ని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఈ సందర్భంగా పృధ్వీ మాట్లాడుతూ.. నాగబాబు తనతో మట్లాడడం లేదని.. కానీ, తనకు చిరంజీవి, పవన్ కల్యాణ్ మళ్లీ ఛాన్స్ ఇచ్చారని వెల్లడించారు. రాజకీయాల కోసం పవన్‌పై విమర్శలు చేయాల్సి వచ్చిందన్నారు. అదే మామూలుగా తిడితే జనాలు ఇంటికొచ్చి మరీ తనను కొట్టేవారన్నారు. తనది వాళ్ల స్థాయి ఏ మాత్రం కాదని... నేనేదైనా చేస్తే హనుమంతుడి ముందు కుప్పిగంతుల్లా ఉంటుందని పృథ్వీ వ్యాఖ్యానించారు. పృధ్వీరాజ్‌లో వచ్చిన ఈ సడెన్ ఛేంజ్ పట్ల మెగా అభిమానులు షాక్ అవుతున్నారు. ఇప్పటికే కొందరు నెటిజన్లు ఆయనను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.

More News

పవన్‌తో హరీష్ శంకర్ భేటీ.. ముహూర్తం సెట్ అయినట్టే..!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ హరీశంకర్ కాంబినేషన్‌లో సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.

దేశ వ్యాప్తంగా ప్రారంభమైన టీకా డ్రైరన్..

దేశ వ్యాప్తంగా కరోనా టీకా డ్రైరన్ శనివారం ప్రారంభమైంది. కరోనా మహమ్మారిని నిరోధించడంలో భాగంగా శుక్రవారం ఆస్ట్రాజెనెకా కంపెనీ,

బాలీవుడ్ రీమేక్‌లో విజయ్ సేతుపతి..

ఏ పాత్ర అయినా సరే.. అద్భుతంగా నటించి.. మెప్పించగల నటుడు.. విజయ్‌ సేతుపతి. అందుకే ఆయనకు అవకాశాలకేమీ కొదువ లేదు.

షూటింగ్‌ పూర్తికాక ముందే రికార్డ్ క్రియేట్ చేసిన ‘ఆచార్య’

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమా షూటింగ్ పూర్తికాకముందే ఒక రికార్డును నమోదు చేసుకుంది.

వ్యాక్సిన్ వచ్చేసింది.. కోవిషీల్డ్‌కు భారత్ గ్రీన్ సిగ్నల్

కరోనా రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు.. ఆరోగ్య సంక్షోభం.. ఆర్థిక వ్యవస్థకు దారుణమైన దెబ్బ.. పలువురి జీవితాలను రోడ్డు పాలు చేసింది. 2020 అంతా ఈ సంక్షోభంతోనే గడిచింది. అయితే 2021 మాత్రం గుడ్ న్యూస్‌ని