తాట తీస్తా.. రాజేంద్రప్రసాద్‌కు పృథ్వీ స్ట్రాంగ్ వార్నింగ్!
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని కలవడానికి తామేం బిజినెస్మెన్లు కాదని సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ చెప్పుకొచ్చిన విషయం విదితమే. గత కొన్నిరోజులుగా టాలీవుడ్ పెద్దలెవరూ వైఎస్ జగన్‌ను పట్టించుకోలేదని.. జగన్ సీఎం కావడం టాలీవుడ్లో కొందరికి ఇష్టం లేదని పృథ్వీ మాట్లాడుతూనే ఉన్నారు. ఈ వ్యాఖ్యలకు టాలీవుడ్ నుంచి ఇప్పటికే పోసాని కృష్ణమురళీ.. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ రియాక్ట్ అయ్యారు. అయితే నటకిరీటీ రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు స్పందించిన టాలీవుడ్ నటుడు, ఎస్వీబీసీ ఛానెల్ చైర్మన్ పృథ్వీరాజ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
తాట తీస్తా.. పులి కడుపునే పులే!
"ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన జగన్‌ను టాలీవుడ్ పెద్దలు కలిసి శుభాకాంక్షలు చెప్పాలని మాత్రమే నేను సూచించాను. అంతేతప్ప నేను ఎవరి గురించీ తప్పుగా మాట్లాడలేదు. ఈ విషయంలో రాజేంద్రప్రసాద్ తిరుమలలో చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి. చంద్రబాబు సీఎం అయితే సత్కారాలు చేసే ఈ పెద్దలు జగన్ సీఎం అవగానే విమర్శలు చేస్తారా?. దివంగత నేత వైఎస్, రాజశేఖరరెడ్డి హయాంలో ఎంతో మంది సినిమావాళ్లు ఆయన నుంచి లబ్ధి పొందారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను ఎవరు విమర్శించినా తాట తీస్తాను. పులి కడుపున పులే పుడుతుందనీ.. లోకేశ్ పుట్టడు" అని పృథ్వీ ఎద్దేవా చేశారు. రాజేంద్రప్రసాద్ ఈ సందర్భంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
కాగా.. చిత్తూరులోని చంద్రగిరిలో వైసీపీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పృథ్వీ.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలకు రాజేంద్ర ప్రసాద్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి. మొత్తానికి చూస్తే .. జగన్ సీఎం అయినప్పట్నుంచి టాలీవుడ్లో మాత్రం పృథ్వీ చిచ్చుపెడుతూనే ఉన్నారని కొందరు విమర్శలు తిట్టిపోస్తున్నారు. మరి ఈ వ్యవహారం ఇంతటితో ఆగుతుందా..? లేకుంటే మరింత ముదురుతుందా..? అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments