మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన

  • IndiaGlitz, [Tuesday,November 12 2019]

మహా ‘పీఠం’పై కూర్చోవాలని అటు బీజేపీ.. ఇటు శివసేన.. మరోవైపు కాంగ్రెస్-ఎన్సీపీ కూర్చోవాలని విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ అవన్నీ ఫలించలేదు. చివరికి ఎవరూ బలం నిరూపించుకోలేకపోవడంతో రాష్ట్రపతి పాలన వచ్చింది. కేంద్ర కేబినెట్ నిర్ణయానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ బీజేపీ, ఎన్సీపీ, శివసేన గవర్నర్ పిలుపునిచ్చినప్పటికీ ఎవరూ సరైన మెజార్టీతో ముందుకు రాలేదు. దీంతో గడువు ముగిసే సరికి రాష్ట్రపతి పాలన వచ్చింది. మంగళవారం సాయంత్రం వరకు బలనిరూపణ చేసుకునేందుకు ఎవరూ రాకపోవడంతో అటు గవర్నర్ సిఫారసు, ఇటు కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలను సమీక్షించిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఇదిలా ఉంటే.. ఇంతటితో మహానాట నాటకీయ పరిణామాలకు ఫుల్‌స్టాప్ పడిందంటే శివసేన అసలు రాజకీయాలు ఇప్పుడిప్పుడే మొదలుపెట్టింది. తమకు ప్రభుత్వ ఏర్పాటు చేసుకునేందుకు తగిన సమయం ఇవ్వలేదంటూ శివసేన పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. శివసేన అభ్యర్థనపై రేపు మధ్యాహ్నం లోపు విచారణ చేపట్టనుంది. అయితే సుప్రీం కేంద్రానికి మొట్టికాయలేస్తుందా..? లేకుంటే శివసేననే తప్పుబడుతుందా..? అనేది రేపు తేలిపోనుంది. ఒక వేళ గడువిచ్చినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే శివసేనకు చుక్కలే.. మరి ఎన్సీపీతో కలిసి ముందడుగేస్తుందో లేకుంటే మిన్నకుండిపోతుందో వేచి చూడాల్సిందే మరి. మొత్తానికి చూస్తే మహా నాటకీయ పరిణామాలు ముంబై నుంచి బీజేపీ.. కాంగ్రెస్ వయా ఎన్సీపీ గుండా సుప్రీంకు చేరాయన్నమాట.

More News

మ‌రోసారి మెగా టైటిల్‌తో

త‌మిళంతో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న హీరోల్లో కార్తి ఒక‌రు. ఆయ‌న హీరోగా న‌టించిన ప్ర‌యోగాత్మ‌క చిత్రం `ఖైదీ` తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌లై ఘ‌న విజ‌యాన్ని సాధించింది.

'జార్జ్ రెడ్డి' ప్రీ రిలీజ్ కు ముఖ్య అతిథిగా పవర్ స్టార్ ?

నిజాం క‌ళాశాల‌, ఉస్మానియా యూనివ‌ర్సిటీల్లో చ‌దువుకునే రోజుల్లో విద్యార్థి నాయ‌కుడిగా ఎంద‌రో విద్యార్థుల‌ను ప్ర‌భావితం చేశారు. కాలేజీ విద్యార్థుల‌కు, రాజ‌కీయాల‌కు ఒక‌ప్పుడు దగ్గ‌ర సంబంధాలుండేవి.

ఇసుక కొరతపై వైఎస్ జగన్ కీలక నిర్ణయం.. కండిషన్స్ అప్లై

ఏపీలో నెలకొన్న ఇసుక కొరతకు శాశ్వత పరిష్కారమార్గం చూపాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం నాడు ‘స్పందన’ కార్యక్రమంపై

పిచ్చోడు ట్రైలర్ విడుదల చేసిన సుధీర్ బాబు

హేమంత్ ఆర్ట్స్ బ్యానర్ పై హేమంత్ శ్రీనివాస్ నిర్మిస్తోన్న సినిమా పిచ్చోడు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలయ్యింది.

జగన్ 'ఇంగ్లిష్' నిర్ణయం సరైనదే..: రాజశేఖర్

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్ పాఠశాలల్లోని అన్ని తరగతులను ఇంగ్లిష్ మీడియంలోకి మారుస్తూ వైఎస్ జగన్ సర్కార్ ఈ నెల 5న జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే.