మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన
Send us your feedback to audioarticles@vaarta.com
మహా ‘పీఠం’పై కూర్చోవాలని అటు బీజేపీ.. ఇటు శివసేన.. మరోవైపు కాంగ్రెస్-ఎన్సీపీ కూర్చోవాలని విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ అవన్నీ ఫలించలేదు. చివరికి ఎవరూ బలం నిరూపించుకోలేకపోవడంతో రాష్ట్రపతి పాలన వచ్చింది. కేంద్ర కేబినెట్ నిర్ణయానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ బీజేపీ, ఎన్సీపీ, శివసేన గవర్నర్ పిలుపునిచ్చినప్పటికీ ఎవరూ సరైన మెజార్టీతో ముందుకు రాలేదు. దీంతో గడువు ముగిసే సరికి రాష్ట్రపతి పాలన వచ్చింది. మంగళవారం సాయంత్రం వరకు బలనిరూపణ చేసుకునేందుకు ఎవరూ రాకపోవడంతో అటు గవర్నర్ సిఫారసు, ఇటు కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలను సమీక్షించిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇదిలా ఉంటే.. ఇంతటితో మహానాట నాటకీయ పరిణామాలకు ఫుల్స్టాప్ పడిందంటే శివసేన అసలు రాజకీయాలు ఇప్పుడిప్పుడే మొదలుపెట్టింది. తమకు ప్రభుత్వ ఏర్పాటు చేసుకునేందుకు తగిన సమయం ఇవ్వలేదంటూ శివసేన పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. శివసేన అభ్యర్థనపై రేపు మధ్యాహ్నం లోపు విచారణ చేపట్టనుంది. అయితే సుప్రీం కేంద్రానికి మొట్టికాయలేస్తుందా..? లేకుంటే శివసేననే తప్పుబడుతుందా..? అనేది రేపు తేలిపోనుంది. ఒక వేళ గడువిచ్చినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే శివసేనకు చుక్కలే.. మరి ఎన్సీపీతో కలిసి ముందడుగేస్తుందో లేకుంటే మిన్నకుండిపోతుందో వేచి చూడాల్సిందే మరి. మొత్తానికి చూస్తే మహా నాటకీయ పరిణామాలు ముంబై నుంచి బీజేపీ.. కాంగ్రెస్ వయా ఎన్సీపీ గుండా సుప్రీంకు చేరాయన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout