కేంద్ర మంత్రి రాజీనామా.. ఆమోదించిన రాష్ట్రపతి
Send us your feedback to audioarticles@vaarta.com
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ సంబంధ బిల్లులు ఎన్డీయే కూటమిలో చిచ్చుకు దారి తీస్తున్నాయి. ఈ బిల్లులను నిరసిస్తూ కేంద్రమంత్రి మంత్రి పదవికి శిరోమణి అకాలీదళ్‌కు చెందిన హర్ సిమ్రత్ కౌర్ బాదల్ రాజీనామా చేశారు. ప్రధాని మోదీ కార్యాలయంలో తన రాజీనామాను అందజేశారు. అయితే ఆమె రాజీనామాను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ శుక్రవారం ఉదయం ఆమోదించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 75 క్లాజ్ 2 ప్రకారం కేంద్ర మంత్రి సిమ్రత్ కౌర్ చేసిన రాజీనామాను ఆమోదించినట్లు రాష్ట్రపతి స్పష్టం చేశారు.
మోదీ సర్కారు పార్లమెంటులో ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాల బిల్లును శిరోమణి అకాలీదళ్ వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి వర్గం నుంచి అకాలీదళ్ వైదొలిగింది. ఈ నేపథ్యంలోనే ఈ పార్టీకి చెందని ఏకైక మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ గురువారం తన పదవికి రాజీనామా చేశారు. మరోవైపు ఆమె భర్త, ఎంపీ సుఖ్‌బీర్‌సింగ్ బాదల్ వ్యవసాయ చట్టాల బిల్లులకు వ్యతిరేకంగా లోక్‌సభలో నిరసన తెలిపారు. ఇన నుంచి తాము నేషనల్ డెమోక్రటిక్ అలియెన్స్‌లో కొనసాగుతామని సుఖ్ బీర్ సింగ్ బాదల్ స్పష్టం చేశారు.
మరోవైపు తన రాజీనామాపై హర్‌సిమ్రత్ కౌర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక ఆర్డినెన్సులు, చట్టాలకు నిరసనగా తాను రాజీనామా చేశానని.. రైతుల సోదరిగా, బిడ్డగా వారి తరఫున నిలిచినందుకు గర్వంగా ఉందని హర్‌సిమ్రత్ కౌర్ ట్వీట్ చేశారు. అలాగే తాను రాజీనామా చేయడానికి గల కారణాలను వివరిస్తూ ప్రధాని మోదీకి హర్‌సిమ్రత్ కౌర్ నాలుగు పేజీల లేఖ రాశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments