ప్రజెంట్ లవ్ + ప్యూర్ లవ్=రొమాన్స్ విత్ ఫైనాన్స్ రేపే రిలీజ్

  • IndiaGlitz, [Thursday,March 17 2016]

స‌తీష్ బాబు, మెరినా అబ్ర‌హం జంట‌గా రాజు కుంప‌ట్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం రొమాన్స్ విత్ ఫైనాన్స్. ఈ చిత్రాన్నిరిషి ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై జ‌నార్ధ‌న్ మంద‌ముల నిర్మించారు. వైవిధ‌మ్యైన క‌థాంశంతో రూపొందిన‌ రొమాన్స్ విత్ ఫైనాన్స్ చిత్రాన్ని 18న రిలీజ్ చేస్తున్నారు.
ఈ సంద‌ర్భంగా ....
హీరో స‌తీష్ బాబు మాట్లాడుతూ...మాది తూర్పుగోదావరి జిల్లా క‌డియం. మా ఊరు క‌డియం పువ్వుల‌కు ప్ర‌సిద్ది. అందుచేత మా ఊరులో ఎక్కువుగా షూటింగ్ లు జ‌రిగేవి. అలా...షూటింగ్ లు చూడ‌డం వ‌ల‌న సినిమాల్లోకి వెళ్లాల‌నే ఆస‌క్తి ఏర్ప‌డింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానిని. ఆయ‌న‌ స్పూర్తితోనే హీరో అవ్వాల‌ని సినిమా రంగంలో ప్ర‌వేశించాను. ప్రేమ ఒక మైకం అనే సినిమాలో న‌టించాను. రొమాన్స్ విత్ ఫైనాన్స్ సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాను. ప్యూర్ ల‌వ్ ఎలా ఉంటుంది. ప్ర‌జెంట్ ల‌వ్ ఎలా ఉంది. యూత్ ఎలా ఉన్నారు అనేది ఈ సినిమాలో చూపించాం. ఈ సినిమాలో నా క్యారెక్ట‌ర్ పేరు జై. అమ్మాయిని చూసి తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాను. ఆత‌ర్వాత ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు రావ‌డం వ‌ల‌న ఏం జ‌రిగింది అనేది ఇంట్ర‌స్టింగ్ గా ఉంటుంది. ఈ చిత్రంలో మొత్తం ఐదు పాట‌లు ఉన్నాయి. జాన్ పోట్ల మంచి ట్యూన్స్ అందించారు. కేర‌ళ, రాజ‌మండ్రి, రంప చోడ‌వ‌రం, వైజాగ్ ల్లో షూటింగ్ చేసాం. జ‌బ‌ర్ధ‌స్త్ టీమ్ చేసిన కామెడీ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. జాన్ అనే కొత్త ద‌ర్శ‌కుడితో నా నెక్ట్స్ మూవీ ఉంటుంది అన్నారు.