20లోకి 'ప్రేమించుకుందాం..రా!'
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రేమకథా చిత్రాల్లో కొత్త ఒరవడిని సృష్టించి ఇండస్ట్రీ హిట్గా నిలిచిన చిత్రం 'ప్రేమించుకుందాం..రా!'. తెలుగు తెరకు తొలిసారి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ని పరిచయం చేసింది ఈ సినిమానే. కథానాయకుడు వెంకటేష్ కెరీర్లోనే పెద్ద హిట్గా అప్పట్లో సంచలనంగా నిలిచిందీ చిత్రం. తెలుగుతెరకు జయంత్ సి.పరాన్జీ దర్శకుడుగా పరిచయమైంది, అంజలా జవేరి హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయిందీ సినిమాతోనే. జయప్రకాష్ రెడ్డి విలనిజం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహేష్ సంగీతంలోని పాటలన్నీ ఆదరణ పొందాయి.
'పెళ్లి కళ వచ్చేసిందే బాల', 'మేఘాలే తాకింది', 'ఓ పనైపోతుంది బాబూ' పాటలు అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. మణిశర్మ నేపథ్య సంగీతం మరో ఆకర్షణగా నిలిచిన ఈ చిత్రం మే 9, 1997న విడుదలైంది. అంటే.. నేటితో 'ప్రేమించుకుందాం..రా!' విడుదలై 19 ఏళ్లు పూర్తయి 20వ వసంతంలోకి అడుగుపెడుతోందన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout