ఆ ముగ్గురు చుట్టూ తిరిగే కథే 'ప్రేమికుడు'
Send us your feedback to audioarticles@vaarta.com
మానస్.ఎన్, సనమ్ శెట్టి జంటగా డిజిపోస్టర్ సమర్పణలో ఎస్.ఎస్.సినిమా పతాకంపై కళా సందీప్ దర్శకత్వంలో లక్ష్మీ నారాయణరెడ్డి, సునీల్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా 'ప్రేమికుడు'. ఈ సినిమా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.
ఈ సందర్భంగా హీరో మానస్ మాట్లాడుతూ.. ''చైల్డ్ ఆర్టిస్ గా చాలా సినిమాల్లో నటించాను. 2004లో నంది అవార్డు కూడా అందుకున్నాను. ఆ తరువాత 'గ్రీన్ సిగ్నల్','కాయ్ రాజా కాయ్' వంటి చిత్రాల్లో నటించాను. అయితే మొదటిసారిగా సోలో హీరోగా ఈ సినిమాతో పరిచయమవుతున్నాను. ఈ సినిమాలో నా పాత్ర పేరు శ్రీ. హీరో, హీరోయిన్, విలన్ ల చుట్టూ తిరిగే కథ ఇది. విలేజ్ లో ఉండే శ్రీ అనే కుర్రాడు జాబ్ కోసం సిటీకు వస్తాడు. అక్కడ తనకు ఓ అమ్మాయి పరిచయమవుతుంది. తనకున్న సమస్యలను హీరో ఎలా సాల్వ్ చేసి తన ప్రేమను దక్కించుకున్నాడనేదే ఈ సినిమా కథ. డైరెక్టర్ కళాసందీప్ నాకు ఏడేళ్ళుగా తెలుసు. సినిమా కథ చెప్పగానే గ్రిప్పింగ్ గా అనిపించింది. అవుట్ పుట్ కూడా బాగా వచ్చింది. ఈ చిత్రాన్ని హైదరాబాద్, నెల్లూరు, బెంగుళూరు తదితర ప్రాంతాల్లో చిత్రీకరించాం. రేపే ఈ సినిమా రిలీజ్ కానుంది. ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ప్రస్తుతం 'డీల్ విత్ ధనలక్ష్మీ' అనే చిత్రంలో నటిస్తున్నాను. అలానే కృష్ణవంశీ గారి 'నక్షత్రం' సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించడానికి ఒప్పుకున్నాను'' అని చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments