'ప్రేమికుడు' లోగో విడుదల

  • IndiaGlitz, [Sunday,August 02 2015]

మాన‌స్‌, స‌న‌మ్ శెట్టి న‌టిస్తున్న 'ప్రేమికుడు' సినిమాను ఎస్‌.ఎస్‌.సినిమా ప‌తాకంపై డిజి పోస్ట‌ర్ స‌మ‌ర్పిస్తోంది. క‌ళా సందీప్ డైర‌క్ష‌న్ చేస్తున్నారు. ఈ సినిమా లోగో ఆవిష్క‌ర‌ణ ఆదివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది.

దామోద‌ర‌ప్ర‌సాద్ లోగోను విడుద‌ల చేసిన ఈ కార్య‌క్ర‌మానికి టి.ప్ర‌స‌న్న‌కుమార్‌, కాదంబ‌రి కిర‌ణ్‌, గ‌జ‌ల్ శ్రీనివాస్‌, తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ‌, మోహ‌న్ వ‌డ్ల‌ప‌ట్ల‌, బ‌సిరెడ్డి త‌దిత‌రులు అతిథులుగా హాజ‌ర‌య్యారు. లోగో బావుంద‌ని, మాన‌స్‌కు మంచి సినిమా కావాల‌ని ఆహూతులు పేర్కొన్నారు. టాకీ, రెండు పాట‌ల‌ను చిత్రీక‌రించామ‌ని, మిగిలిన పాట‌ల‌ను కూడా చిత్రీక‌రించి త్వ‌ర‌లోనే పాట‌ల్ని విడుద‌ల చేస్తామ‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు తెలిపారు.