'ప్రేమెంత పనిచేసే నారాయణ' అక్టోబర్ 5న రిలీజ్
Send us your feedback to audioarticles@vaarta.com
హరికృష్ణ జొన్నలగడ్డ, అక్షిత జంటగా నటిస్తోన్న చిత్రం` ప్రేమెంత పనిచేసే నారాయణ`. భాగ్యలక్ష్మి సమర్పణలో జె.ఎస్. ఆర్ మూవీస్ పతాకంపై జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో సావిత్రి జొన్నలగడ్డ నిర్మిస్తున్నారు. అన్ని పనులు పూర్తిచేసుకుని అక్టోబర్ 5న సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా శనివారం ఉదయం హైదరాబాద్ ఫిలిం చాంబర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో..
చిత్ర దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ, ` సినీ పరిశ్రమలో 30 ఏళ్ల నుంచి ఉంటున్నాను. చాలా మంది పెద్ద హీరోల సినిమాలకు పనిచేసాను. దర్శకుడిగా నాకిది తొమ్మిదవ సినిమా. కథ వైవిథ్యంగా ఉందనే నా కుమారుడిని ఈ సినిమా తో హీరోగా పరిచయం చేస్తున్నా. రెగ్యులర్ లవ్ స్టోరీలకు భిన్నంగా ఉంటుంది. ఇప్పటికే చాలా లవ్ స్టోరీలు వచ్చాయి. కానీ ఇలాంటి పాయింట్ ఇప్పటివరకూ ఏ డైరెక్టర్ టచ్ చేయలేదు. క్లైమాక్స్ ఆద్యంత ఆసక్తికరంగా సాగుతుంది. ఆ సన్నివేశాలు చూసి ఆడియన్స్ కచ్చితంగా చప్పట్లు కొడతారు. ఇండస్ర్టీలో పెద్దలందరి సహకారం...సూచనలతో అక్టోబర్ 5వ తేదిన రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేసాం. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా ఇది` అని అన్నారు.
హీరో హరికృష్ణ మాట్లాడుతూ, ` అన్నీ జనరేషన్లకు కనెక్ట్ అయ్యే ప్రేమకథా చిత్రమిది. సినిమా చూస్తున్నంత సేపు ఓ కొత్త కథను చూస్తున్నామనే అనుభూతి కలుగుతుంది. ప్రేమలో బాధను సినిమా తెలియజేస్తుంది. ప్రేమికులైతే ఇలాంటి అనుభవాలు మన జీవతంలో కూడా ఉన్నాయనుకుంటారు. కథలో చాలా ట్విస్టులుంటాయి. సినిమా చాలా బాగా వచ్చింది. మా సినిమాకు మీడియా కూడా మంచి పబ్లిసీటీ ఇచ్చింది. తప్పకుండా విజయం సాధిస్తాం` అని అన్నారు.
సంగీత దర్శకుడు యాజమాన్య మాట్లాడుతూ, `ఇదొక డిఫరెంట్ లవ్ స్టోరీ. ప్రేమలో బాధను చెప్పే ఓ మంచి సినిమా ఇది. హీరో, హీరోయిన్ల పాత్రలు హైలైట్ గా ఉంటాయి. ఆడియోకు శ్రోతల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కూడా పెద్ద సక్సెస్ అవుతుంది` అని అన్నారు.
ఇంకా ఈ సమావేశంలో యూనిట్ సభ్యులు, చిత్ర నిర్మాత సావిత్రి జొన్నలగడ్డ తదితరులు పాల్గొన్నారు.
ఝాన్సీ, చిలుకూరి రంగారావు, ఎ.ఆర్. సి బాబు, రాహుల్ బొకాడియా, పింగ్ పాంగ్, రాఘవపూడి, రాజారావు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: జె.ఎస్. ఆర్ మూవీస్, కథనం: భూపతిరాజా, మరుదూరి రాజా, రాజేంద్ర కుమార్, మాటలు: సుబ్బారాయుడు బొం పెం, పాటలు: వనమాలి, గోసల రాంబాబు, ఎడిటింగ్ : జానకి రామ్, ఫైట్స్ : రామ సుంకర, పీఆర్ ఓ: సతీష్.కె, కెమరా: పి. ఎస్. వంశీ ప్రకాశ్, కొరియోగ్రఫీ:ప‌్రేమ్ రక్షిత్, విద్యాసాగార్, శ్రీధన్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments