'ప్రేమతో మీ కార్తీక్' సమ్మర్ లో విడుదల

  • IndiaGlitz, [Friday,March 17 2017]

జీవితంలో కెరీర్ ఒక భాగం మాత్రమే. అదే జీవితం కాదు. అనే విషయాన్ని తెలియజెప్పే విలువలతో కూడిన కుటుంబ కథా చిత్రం ప్రేమతో మీ కార్తీక్. రమణశ్రీ ఆర్ట్స్ బ్యానర్లో గీతా మన్నం సమర్పణలో రమణశ్రీ గుమ్మకొండ, రవీందర్ గుమ్మకొండ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. రిషి ఈ చిత్రానికి దర్శకుడు. కార్తికేయ, సిమ్రత్, మురళీ శర్మ, గొల్లపూడి మారుతీ రావు, పృథ్వీ, ప్రగతి, సుమిత్ర, రఘు కారమంచి, శత్రు, మధునందన్, ఝాన్సీ, ప్రియ, జయవాణి, ఫణి, నర్సింహరాజు, కోటేశ్వరరావు, రాఘవ తదితరులు నటించారు. చిత్ర షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. వేసవి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అతిత్వ‌ర‌లో టీజ‌ర్, ఆడియో లు విడుద‌ల చేయ‌నున్నారు.
ఈ సందర్భంగా లైన్ ప్రోడ్యూస‌ర్ అశోక్‌రెడ్డి గుమ్మ‌కొండ‌ మాట్లాడుతూ.... " ప్రేమతో మీ కార్తీక్ చిత్రాన్ని దర్శకుడు రిషి అందమైన కథతో అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా తెరకెక్కించారు. కెరీర్, ప్రేమ, కుటుంబాల మధ్య ఉండే సంబంధాల్ని చక్కగా చూపించారు. ఈ చిత్రంతో మంచి దర్శకుల లిస్టులో రిషి చేరతాడని భావిస్తున్నాం. భలే భలే మగాడివోయ్ తర్వాత మురళీ శర్మ అంత అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ చేశారు. గొల్లపూడి మారుతి రావు గారు చాలా కాలం తర్వాత ఒక ఎమోషనల్ క్యారెక్టర్ చేశారు. సంసారం ఓ చ‌ద‌రంగం చిత్రం త‌రువాత ఆ రేంజి పాత్ర‌లో ఆయ‌న క‌నిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని కేరళ లోని వాగమన్, ఇడుక్కి ప్రాంతాల్లో కూర్ల్ లో ఇప్పటివరకు ఎవ్వరూ షూట్ చేయని అందమైన లొకే,న్స్ లో షూట్ చేయడం జరిగింది. మలయాళంలో సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ షాన్ రెహమాన్ అందించిన పాటలు హైలైట్ గా నిలుస్తాయి. సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సినిమాటోగ్రఫీ మరో హైలైట్ గా ఉంటుంది. కేరళ, కూర్గ్, గోవా, హైదరాబాద్ లో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. చిత్ర షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అతిత్వ‌ర‌లో టీజ‌ర్ ని ఆడియో ని విడుద‌ల చేసి చిత్రాన్ని వేస‌వి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం." అని అన్నారు.
నటీనటులు - కార్తికేయ, సిమ్రత్, మురళీ శర్మ, గొల్లపూడి మారుతీ రావు, పృథ్వీ, ప్రగతి, సుమిత్ర, రఘు కారమంచి, శత్రు, మధునందన్, ఝాన్సీ, ప్రియ, జయవాణి, ఫణి, నర్సింహరాజు, కోటేశ్వరరావు, రాఘవ తదితరులు నటించారు.

More News

బాలయ్య ఎనర్జి చూసి పూరి థ్రిల్...

బాలయ్య తన 101వ సినిమాను అనుకున్న టైం ప్రకారం మార్చి 16న స్టార్ట్ చేసేశాడు.

బాలీవుడ్ దర్శకుడుతో నిఖిల్ సినిమా...

రీసెంట్ గా ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో హిట్ అందుకున్న నిఖిల్ ఇప్పుడు కేశవ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

దుబాయ్ లో మహేష్ మ్యూజిక్ సిట్టింగ్స్...

'శ్రీమంతుడు'వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సూపర్ స్టార్ మహేష్,సూపర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో

ప్రభాస్ తర్వాత శ్రేయ...

హీరోయిన్ శ్రేయ కాదులే సుమా...సింగర్ శ్రేయా ఘోషల్..

'చెలియా' రిలీజ్ డేట్ కన్ ఫర్మ్...

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఓకే బంగారం చిత్రాన్ని తెలుగులో విడుదల చేసిన నిర్మాతగా మరో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.