న‌వంబ‌ర్ 17న విడుద‌ల కానున్న ప్రేమ‌తో మీ కార్తిక్

  • IndiaGlitz, [Sunday,November 12 2017]

మూడు జెన‌రేష‌న్స్ మద్య ప్రేమ ఆప్యాయ‌త‌ల్ని చ‌క్క‌గా తెర‌కెక్కించిన‌ చిత్రం 'ప్రేమ‌తో మీ కార్తీక్'. రిషి ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ర‌వీంద‌ర్ ఆర్‌.గుమ్మ‌కొండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో కార్తికేయ‌, సిమ్రాత్ లు హీరోహీరోయిన్స్ గా ప‌రిచ‌యం అవుతున్నారు. షాన్ రెహ‌మాన్ సంగీతాన్ని అందించారు. సాయిప్ర‌కాష్ ఉమ్మ‌డిసింగ్ సినిమాటోగ్రాఫ‌ర్‌, ఈచిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత స‌క్స‌స్ కి చిరునామాగా మారిన దిల్ రాజు గారు విడుదల చేస్తున్నారు. న‌వంబ‌ర్ 11న ఈ చిత్రానికి సంభందించి ప్రీరిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్ లో జ‌రిగింది. ఈ కార్క‌క్ర‌మానికి చిత్ర యూనిట్ తో పాటు ప్ర‌ముఖ రాజ‌కీయ‌నాయ‌కులు హ‌జ‌ర‌య్యారు. కామెడి లో కొత్త ట్రెండ్ గా మారిన బిత్తిరి స‌త్తి స్పెష‌ల్ గా అర్జున్ రెడ్డి గెట‌ప్ లో వ‌చ్చి అంద‌ర్ని అల‌రించాడు

ఈ కార్య‌క్ర‌మంలో ద‌ర్శ‌కుడు రిషి మాట్లాడుతూ - ఈ చిత్రం అంద‌ర్ని ఆక‌ట్ట‌కుంటుంది. ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ విత్ హ్యూమ‌న్ రిలేష‌న్ తో నిర్మించాము. మా హీరో కార్తిక్ చాలా బాగా అంటే ప‌ది చిత్రాలు అనుభం వున్న‌ట్టు న‌టించాడు. హీరోయిన్ సిమ్ర‌త్ పెద్ద హీరోయిన్ గా నిలుస్తుంది. మ్యాజిక్ షాన్ రెహ‌మాన్ ప్రాణం పెట్టి చేశాడు. విజువ‌ల్స్ ఫీస్ట్ గా మా చిత్రం నిలుస్తుంది. ఈ చిత్రానికి ప‌నిచేసిన వారంతా కొత్త‌వారే కావ‌టంతో చాలా కొత్త చిత్రం వ‌చ్చింది. నాతో పాటు ప‌నిచేసిన నా టెక్నిషియ‌న్స్ అంద‌రికి నా ధ్య‌న్య‌వాదాలు.. న‌వంబ‌ర్ 17న విడుద‌లవుతుంది. అని అన్నారు

నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ మాట్లాడుతూ.. ప్రేమ‌తో మీ కార్తిక్ చిత్రాన్ని మేము చాలా ఇష్ట‌ప‌డి చేశాము. మా ద‌ర్శ‌కుడు రిషి చాలా అందంగా తెర‌కెక్కించారు. ఫ‌స్ట్ టైం వ‌న‌స్ధ‌లిపురంలో ఓక చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ చేయ్య‌టం.. ఇంత పెద్ద స‌క్స‌స్ చేసినందుకు ప్ర‌తి ఓక్క‌రికి మా ధ‌న్య‌వాదాలు.. మా వ‌దిన గారి ప్రారంభించిన బ్యాన‌ర్ ర‌మ‌న‌శ్రీ ప్రోడ‌క్ష‌న్ మా అన్న‌య్య‌గారు నిర్మాతగా చేశారు. మా రెండ‌వ చిత్రం కూడా ప్రారంభం అయ్యింది. కెజి నుండి పిజి వ‌ర‌కూ అంద‌రూ హ్య‌పి గా ఈ చిత్రం చూడోచ్చు చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నాం.. న‌వంబ‌ర్ 17న ఈచిత్రం విడుద‌ల‌వుతుంది. అని అన్నారు.

న‌టి ప్ర‌గ‌తి మాట్లాడుతూ.. నేను చాలా చిన్న త‌నం నుండి సినిమాల్లో వున్నాను. కేవ‌లం కొన్ని చిత్రాల‌తోనే అనుభందం వుంటుంది. ఈ చిత్ర యూనిట్ తో నేను మ‌రింత అనుభందం ఏర్ప‌రుచుకున్నాను. కార్తిక్ కి ఓ మ‌ద‌ర్ గా ఈ ఫంక్ష‌న్ కి వ‌చ్చాను.. నేను ఈ చిత్రంలో చాలా మంచి పాత్ర‌లో నటించాను.. ఓ కూత‌రు గా, ఓ చెల్లెలుగా, ఓ భార్య‌గా, ఓ అమ్మ‌గా అన్ని ఎమెష‌న్స్ నాతో చేయించారు ద‌ర్శ‌కుడు. త‌ప్ప‌కుండా ఈ చిత్రం న‌చ్చుతుంది. అన్నారు

న‌టుడు ఫ‌ణి మాట్లాడుతూ.. ఈ చిత్రంలో నేను తాగుబోతు పాత్ర‌లో న‌వ్విస్తాను. మా ద‌ర్శ‌కుడు రిషి చాలా మంచి ద‌ర్శ‌కుల్లో ఓక‌రుగా నిలుస్తారు. కార్తిక్ చాలా బాగా న‌టించాడు.. అని అన్నాడు..

నిర్మాత ర‌వీంద‌ర్ ఆర్ గుమ్మ‌కొండ మాట్లాడుతూ.. మా అన్నయ్య కుమారుడు కార్తిక్ ని హీరోగా ప‌రిచ‌యం చేస్తున్నాం. అలానే నేను కేవ‌లం ఫైనాన్స్ పంప‌టం మాత్ర‌మే చేశాను నా తమ్ముడు ఈ చిత్రానికి మ‌రో నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ అన్ని తానై వుండి ఈ చిత్రాన్ని ఇక్క‌డివర‌కూ తీసుకువ‌చ్చాడు. అలానే ద‌ర్శ‌కుడు రిషి చెప్పిన దానికంటే అందంగా చిత్రాన్ని తెర‌కెక్కించారు. అలానే హీరోయిన్ కి అమెరికాలో కూడా ఫ్యాన్స్ వున్నారు. ఈ చిత్రం విడుద‌ల త‌రువాత పెద్ద హీరోయిన్ అవుతుంది. అలాగే విజువ‌ల్స్‌, సంగీతం చాలా బాగున్నాయి. ఈ చిత్రం న‌వంబ‌ర్ 17న విడుద‌ల చేస్తున్నాం. మాకు ఎంత‌గానో స‌పోర్ట్ చేస్తున్నా ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు గారికి మా ప్ర‌త్య‌ఖ ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాము.. అన్నారు

హీరోయిన్ సిమ్రాత్ మాట్లాడుతూ.. తెలుగు లో ఇంత గ్రాండ్ ఎంట్రి వ‌స్తుంద‌ని అనుకోలేదు.. కార్తిక్ తో న‌టించ‌డం చాలా ల‌క్కి గా ఫీల్ అవుతున్నాను. అంతేకాదు చాలా మంచి టీం నా మెద‌టి చిత్రానికి దొర‌క‌టం చాలా ఆనందంగా వుంది. మంచి పాత్ర‌లో గొప్ప వాళ్ళ‌తో క‌లిసి న‌టించాను.. త‌ప్ప‌కుండా అంద‌ర్ని ఆక‌ట్టుకుంటుంది. అన్నారు

హీరో కార్తిక్ మాట్లాడుతూ.. నా మెద‌టి చిత్రం మా బాబాయ్ లు నిర్మాత‌లు కావ‌టం ఓ అదృష్టం గా భావిస్తే.. సినిమాకి నా పేరునే టైటిల్ గా పెట్టం మ‌రో అదృష్టం గా భావిస్తున్నాను. నేను సినిమాలో న‌టిస్తాను అనగానే మా టోట‌ల్ ఫ్యామిలి అంతా అంగీకంరిచారు. కృష్ణాన‌గ‌ర్ లొ ప‌డే క‌ష్టాలు నేను ప‌డ‌లేదు డైర‌క్ట్ గా హీరో అయిపోయాను.. లాస్ట్ సంవ‌త్స‌రం నుండి ప్ర‌తి రోజు ఇష్టం గా చేశాను.. మా ఫ్యామిలి నాకు ఈ చిత్రం గిఫ్ట్ గా ఇచ్చారు. నా మెద‌టి చిత్రంలో గోల్ల‌పూడి గారు, ముర‌ళిశ‌ర్మ గారు, ప్ర‌గ‌తి గారు లాంటి సీనియ‌ర్ న‌టుల‌తో చెయ్య‌టం నా ల‌క్ గా భావిస్తును. ఇక్క‌డ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ చేయ్యంటం నాకు చాలా ఆనందంగా వుంది. ఈ చిత్రం న‌వంబ‌ర్ 17న విడుద‌ల అవుతుంది. మీఅంద‌రూ ఇది మా చిత్రం అని చెప్పుకునేలా అందంగా వుంటుంది. అని అన్నారు

కార్తికేయ‌,సిమ్ర‌త్‌, గొల్ల‌పూడి మారుతీరావు, సుమిత్ర‌, ముర‌ళీశ‌ర్మ‌, పృథ్వీ, ప్ర‌గ‌తి, ఝాన్సీ, దువ్వాసి, కారుమంచి ర‌ఘు త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి

సాహిత్యంః శ్రీమ‌ణి, ఎడిట‌ర్ః మ‌ధు, ఆర్ట్ః హ‌రివ‌ర్మ‌, సినిమాటోగ్ర‌ఫీః సాయిప్ర‌కాష్ ఉమ్మ‌డిసింగు, సంగీతంః షాన్ రెహ‌మాన్, లైన్ ప్రొడ్యూస‌ర్ః అశోక్‌రెడ్డి గుమ్మ‌కొండ‌, నిర్మాతః ర‌వీంద‌ర్ ఆర్‌.గుమ్మ‌కొండ‌, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వంః రిషి.