ప్రేమతో మీ కార్తిక్ పాటలను రిలీజ్ చేసిన వంశి, హరీష్ శంకర్

  • IndiaGlitz, [Thursday,November 16 2017]

మూడు జెన‌రేష‌న్స్ మద్య ప్రేమ ఆప్యాయ‌త‌ల్ని చ‌క్క‌గా తెర‌కెక్కించిన‌ చిత్రం 'ప్రేమ‌తో మీ కార్తీక్'. రిషి ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ర‌వీంద‌ర్ ఆర్‌.గుమ్మ‌కొండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో కార్తికేయ‌, సిమ్రాత్ లు హీరోహీరోయిన్స్ గా ప‌రిచ‌యం అవుతున్నారు. షాన్ రెహ‌మాన్ సంగీతాన్ని అందించారు. సాయిప్ర‌కాష్ ఉమ్మ‌డిసింగ్ సినిమాటోగ్రాఫ‌ర్‌, ఈచిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత స‌క్స‌స్ కి చిరునామాగా మారిన దిల్ రాజు గారు విడుదల చేస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్ టీజర్స్, ట్రైలర్స్ కి అనూహ్యమైన స్పందన లభించింది. ఈ సందర్భంగా

ప్రముఖ దర్శకులు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ ప్రేమతో మీ కార్తీక్ నవంబర్ 17న విడుదల అవుతుంది. నిర్మాత, దర్శకుడు, హీరో, హీరోయిన్ ఇలా కొత్తవారందరూ ఈ సినిమాతో తెలుగు చిత్ర సీమకు పరిచయం అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. సినిమా కూడా చాలా ప్రామిసింగ్ గా అనిపిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న జిమికి కమల్ సాంగ్ ని కంపోజ్ చేసిన షాన్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతదర్శకునిగా వ్యహరించారు. నవంబర్ 17న విడుదల కాబోతున్న ప్రేమతో మీ కార్తీక్ ప్రేక్షకుల్ని అలరిస్తోందని ఆశిస్తున్నాను అని అన్నారు.

డైన‌మిక్ ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ మాట్లాడుతూ.. ప్రేమ‌తో మీ కార్తిక్ చిత్రం ట్రైల‌ర్ , సాంగ్స్ చూశాను చాలా బాగున్నాయి. ద‌ర్శ‌కుడు రిషి చాలా క‌ష్ట‌ప‌డి ఇష్టం తో చేశాడు. హీరో కార్తిక్‌, సిమ్రాత్ లు చాలా అందంగా క‌నిపిస్తున్నారు. నిర్మాత‌లు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా తీసారు. సినిమా అంత‌బాగుంది కాబ‌ట్టే స‌క్స‌స్‌ఫుల్ నిర్మాత దిల్ రాజు గారు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. త‌ప్ప‌కుండా ఈ చిత్రం అంద‌ర్ని ఆక‌ట్టుకుంటుంది. అని అన్నారు.

కార్తికేయ‌,సిమ్ర‌త్‌, గొల్ల‌పూడి మారుతీరావు, సుమిత్ర‌, ముర‌ళీశ‌ర్మ‌, పృథ్వీ, ప్ర‌గ‌తి, ఝాన్సీ, దువ్వాసి, కారుమంచి ర‌ఘు త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సాహిత్యంః శ్రీమ‌ణి, ఎడిట‌ర్ః మ‌ధు, ఆర్ట్ః హ‌రివ‌ర్మ‌, సినిమాటోగ్ర‌ఫీః సాయిప్ర‌కాష్ ఉమ్మ‌డిసింగు, సంగీతంః షాన్ రెహ‌మాన్, లైన్ ప్రొడ్యూస‌ర్ః అశోక్‌రెడ్డి గుమ్మ‌కొండ‌, నిర్మాతః ర‌వీంద‌ర్ ఆర్‌.గుమ్మ‌కొండ‌, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వంః రిషి.

More News

వెంకీ చిత్రంలో రానా, నాగచైతన్య?

గురు చిత్రం తరువాత కొన్నాళ్ల పాటు విరామం తీసుకున్న సీనియర్ కథానాయకుడు వెంకటేష్.. తన తదుపరి సినిమాని సంచలన దర్శకుడు తేజతో చేయబోతున్న సంగతి తెలిసిందే.

శర్వానంద్ తో సాయిపల్లవి?

మహానుభావుడుతో రీసెంట్ గా తన ఖాతాలో మరో విజయాన్ని వేసుకున్నారు యువ కథానాయకుడు శర్వానంద్. ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు శర్వానంద్. ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

వచ్చే ఏడాది రూట్ మారుస్తున్న నితిన్

గత మూడేళ్లుగా ఏడాదికో సినిమాతో పలకరిస్తూ ఉన్నాడు యువ కథానాయకుడు నితిన్. 2015లో కొరియర్ బోయ్ కళ్యాణ్ తో పలకరించిన నితిన్.. గతేడాది సంచలన విజయం సాధించిన అఆతో పలకరించారు. ఇక ఈ సంవత్సరం లైతో సందడి చేశారు.

శ్రియతో కెమిస్ట్రీ బావుందట

పదహారేళ్లుగా కథానాయికగా అలరిస్తోంది ఢిల్లీ డాళ్ శ్రియా శరన్. ఈ ఏడాది ఆరంభంలో బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణిలో వశిష్టి దేవీ పాత్రలో అలరించిన శ్రియ.. ప్రస్తుతం మూడు చిత్రాలతో బిజీగా ఉంది.

నయనతార హిట్ చిత్రం.. రీమేక్ గా?

తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు చేసిన కేరళకుట్టి నయనతార.. తాజాగా మరో విమెన్ సెంట్రిక్ సబ్జెక్ట్తో పలకరించింది. ఆ చిత్రమే అరమ్. గత శుక్రవారం విడుదలైన ఈ తమిళ సినిమా.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.