పెళ్లికి ముందు శృంగారం.. ఏడాది జైలుశిక్ష , భారీ జరిమానా ..
Send us your feedback to audioarticles@vaarta.com
పెళ్లికి ముందు శృంగారం ... ఇప్పటికీ సమాజాన్ని వేధిస్తోన్న ప్రశ్న. పాశ్చాత్య దేశాల్లో ఇది సర్వ సాధారణమే అయినా భారత్ వంటి కట్టుబాట్లు వున్న మనదేశంలో ఇది చట్టవిరుద్ధం. విదేశీ జీవనశైలి, సంస్కృతిని గ్రహించినా దీని గురించి మాత్రం ఇప్పటికీ ఇండియాలో పెద్ద డిస్కషన్ నడుస్తోంది. వివాహానికి ముందు పరాయి వ్యక్తితో శారీరక సంబంధం కలిగి వుండటం ఇప్పటికీ అనైతికంగా, చేయరాని పాపంగా పరిగణిస్తోంది భారతీయ సమాజం.
సిద్ధాంతాలు.. విలువలే ముఖ్యం:
ఒక్క మనదేశంలోనే కాదు.. చాలా దేశాల్లో పెళ్లికి ముందు శృంగారం నిషేధం. తాజాగా వివాహానికి ముందు సెక్స్‌తో పాటు సహ జీవనాన్ని నిషేధించేందుకు ఇండోనేషియా ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వ సిద్ధాంతాలు, విలువలకు , దేశాధ్యక్షుడు లేదా సంస్థలను కించపరిచే వ్యాఖ్యలపైనా ఆంక్షలు విధించాలని డిసైడ్ అయ్యింది. వీటిని ఉల్లంఘిస్తే ఏడాది పాటు జైలు శిక్ష లేదా జరిమానా విధించనుంది. అంతేకాదు.. వివాహేతర సంబంధాలు పెట్టుకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని, వీటన్నింటిని వ్యభిచారం కింద పరిగణించి శిక్షిస్తామని ఇండోనేషియా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిబంధనలు ఆ దేశ పౌరులతో పాటు తమ గడ్డపైకి వచ్చే విదేశీయులకు కూడా వర్తిస్తాయని పేర్కొంది.
2019లోనే అమల్లోకి రావాల్సిన చట్టం:
కొత్త నిబంధనలతో కూడిన క్రిమినల్ కోడ్ ముసాయిదాను ఈ నెలలోనే పార్లమెంట్లో ప్రవేశపెడతామని ఆ దేశ ఉప న్యాయ శాఖ మంత్రి ఎడ్వర్డ్ ఒమర్ షరీఫ్ హియారిజ్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ముస్లింల జనాభా వున్న ఇండోనేషియా ఇప్పటికే మహిళలు, మతపరమైన మైనారిటీలు, స్వలింగ సంపర్కులపై ఎన్నో ఆంక్షలు విధిస్తుందని ఇప్పటికే అంతర్జాతీయ సమాజం మండిపడుతోంది. కానీ తమ విలువలను కాపాడుకునేందుకు ఎంతవరకైనా వెళ్తామని ఇండోనేషియా చెబుతోంది. అయితే ఈ కొత్త చట్టం.. 2019లోనే అమల్లోకి రావాల్సి వుంది. కానీ పౌర స్వేచ్ఛను అణచివేసేలా వుందంటూ వేలమంది ఆందోళనలకు దిగారు. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం వెనక్కి తగ్గి... ప్రజలు, మేధావులతో చర్చలు జరిపి కొన్ని మార్పులతో నూతన చట్టాన్ని తీసుకొచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout