డిసెంబర్ 6 'ప్రేమంటే సులువు కాదురా' ఆడియో వేడుక!!
Send us your feedback to audioarticles@vaarta.com
యువ ప్రతిభాశాలి చందా గోవింద్‌రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ఆర్.పి.క్రియేషన్స్ పతాకంపై భవనాసి రాంప్రసాద్ నిర్మిస్తున్న వినూత్న ప్రేమకథా చిత్రం ప్రేమంటే సులువు కాదురా`. కొమారి సుధాకర్‌రెడ్డి-శ్రీపతి శ్రీరాములు సహ నిర్మాతలు. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో.. సిమ్మీదాస్ హీరోయిన్. ఈ చిత్రం ఆడియో..
ఆదివారం (డిసెంబర్ 6) సాయంత్రం 6 గం॥లకు ప్రముఖ ఆడియో కంపెనీ మధుర మ్యూజిక్` ద్వారా విడుదల కానుంది. హైద్రాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ ధియేటర్ ఇందుకు వేదిక కానుంది. పలువురు ప్రముఖులు ఈ పాటల వేడుకలో ముఖ్య అతిధులుగా పాల్గొంటున్నారు. కృష్ణ మదినేని సాహిత్యం సమకూర్చిన ఈ చిత్రానికి యువ సంగీత తరంగం నందన్‌రాజ్ స్వర సారధ్యం వహిస్తుండగా.. ప్రాణం` కమలాకర్ నేపధ్య సంగీతం అందిస్తున్నారు!!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com