సెన్సార్ సన్నాహాల్లో 'ప్రేమంటే సులువు కాదురా'

  • IndiaGlitz, [Saturday,January 23 2016]
ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం ప్రేమంటే సులువు కాదురా'. సిమ్మీదాస్ హీరోయిన్. యువ ప్రతిభాశాలి చందా గోవింద్‌రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ఆర్‌.పి.ప్రొడక్షన్స్‌ పతాకంపై భవనాసి రాంప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొమారి సుధాకర్‌రెడ్డి-శ్రీపతి శ్రీరాములు సహ నిర్మాతలు. కృష్ణ మాదినేని సాహిత్యం సమకూర్చగా.. నందన్‌రాజ్‌ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ సినిమా గీతాలు ప్రముఖ మ్యూజిక్‌ కంపెనీ మధుర ఆడియో' ద్వారా విడుదలై విశేష ఆదరణ పొందుతున్నాయి. "ప్రాణం" కమలాకర్ ఈ చిత్రానికి రీ-రికార్డింగ్ చేయడం గమనార్హం. మొదటి కాపి సిద్ధం చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకొంటోంది.
ఈ సందర్భంగా......
దర్శకుడు చందా గోవింద్ రెడ్డి మాట్లాడుతూ.. "కథ-కథనాలు, సంభాషణలు, పాటలు, నేపధ్య సంగీతం, హీరోహీరోయిన్స్ పెర్ఫార్మెన్స్ "ప్రేమంటే సులువు కాదురా" చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలు. సినిమా చాలా బాగా వచ్చింది. ఇటీవల కాలంలో వచ్చిన ఫీల్ గుడ్ లవ్ ఎంటర్ టైనర్స్ లో "టాప్ టెన్" లో ఒకటిగా "ప్రేమంటే సులువు కాదురా" నిలుస్తుందనే నమ్మకం మాకుంది. "ప్రాణం" కమలాకర్ అందించిన నేపధ్య సంగీతం, ఉద్ధవ్ ఎడిటింగ్ సినిమాకు ప్రాణంగా నిలుస్తాయి. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని అతి త్వరలో విడుదల చేసేందుకు మా నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు" అన్నారు.

More News

మరో రీమేక్ ప్లాన్ లో చరణ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమిళ మూవీ తని ఓరువన్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ చిత్రం షూటింగ్ ను ఫిబ్రవరి 16 నుంచి ప్రారంభించనున్నారు.

అ..ఆ నుంచి అనిరుథ్ అవుట్..

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నచిత్రం అ..ఆ.నితిన్ హీరోగా నటిస్తున్న అ..ఆ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుది.

మూడో షెడ్యూల్ లో 'షీ'

కల్వకుంట్ల తేజేశ్వర్‌ రావ్‌(కన్నారావ్‌) నిర్మాతగా గతంలో '999' చిత్రానికి దర్శకత్వం వహించిన పర్స రమేష్‌ మహేంద్ర దర్శకత్వంలో మహేశ్వర ఆర్ట్స్‌ పతాకంపై తెరకెక్కుతోన్న చిత్రం 'షీ'.

'నాన్న‌కు ప్రేమ‌తో' ర‌చ‌యిత హుస్సైన్ షా కిర‌ణ్ ద‌ర్శ‌కుడిగా 'మీకు మీరే మాకు మేమే''

ఇటీవ‌ల సంక్రాంతి బ‌రిలో విడుద‌ల‌య్యిన నాన్న‌కు ప్రేమ‌తో చిత్ర ర‌చయిత హుస్సైన్ షా కిర‌ణ్ ద‌ర్శ‌కుడిగా మారి మీకు మీరే మాకు మేమే అనే చిత్రాన్ని నిర్మించారు.

చైతు ప్రేమ‌మ్ ఫ‌స్ట్ లుక్ డేట్

అక్కినేని నాగ చైత‌న్య హీరోగా న‌టిస్తున్న ప్రేమ‌మ్ రీమేక్ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రాన్ని కార్తీకేయ ఫేం చందు మొండేటి తెర‌కెక్కిస్తున్నారు.