ప్రేమమ్ ట్రైలర్ క్రియేటివిటీ అదిరింది..!
Send us your feedback to audioarticles@vaarta.com
నాగచైతన్య హీరోగా కార్తికేయ ఫేమ్ చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన విభిన్న ప్రేమకథా చిత్రం ప్రేమమ్. గోపీ సుందర్, రాజేష్ మురుగేషన్ సంగీతం అందించిన ప్రేమమ్ ఆడియో వేడుకలో థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసారు. ప్రపంచంలో ప్రతీ ప్రేమకథా మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది అని చైతు చెప్పే డైలాగ్ తో ప్రేమమ్ ట్రైలర్ స్టార్ అవుతుంది. ఈ డైలాగ్ తోనే ప్రేమమ్ ఎలా ఉండబోతుందో చెప్పేసాడు.
ముఖ్యంగా చిన్నప్పుడు చైతు, కాలేజ్ డేస్ లో చైతు, మెచ్యూర్డ్ చైతు...ఇలా మూడు డిఫరెంట్ లుక్స్ లో చైతు అదరగొట్టేసాడు. ఈ మూడు డిఫరెంట్ లుక్స్ కోసం చైతు ఎంత కష్టపడ్డాడో...అంతగా కష్టపడ్డాడంటే ఈ కథ ఎంత నచ్చిందో తెలుస్తుంది. గోపీసుందర్ మ్యూజిక్, కార్తీక్ ఘట్టమనేని విజువల్స్, చందు మొండేటి టేకింగ్ & డైలాగ్స్ చూస్తుంటే ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ప్రేమమ్ సంచలన విజయం సాధిస్తుంది అనిపిస్తుంది. ఫైనల్ గా చెప్పుకోవాల్సింది ఈ ట్రైలర్ నిడివి 1.43 సెకన్లు. 143 అంటే ఏమిటో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు కదా..! ఇది చాలు ప్రేమమ్ ని టీమ్ ఎంతగా ప్రేమిస్తున్నారో చెప్పడానికి. మరి...ఇంత ప్రేమతో సినిమా చేస్తే...విజయం రాకుండా ఉంటుందా..! ఆల్ ది బెస్ట్ టు ప్రేమమ్ టీమ్..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com