నాగ్, అమల పెళ్లిరోజున చైతు ప్రేమమ్..
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని నాగ చైతన్య హీరోగా కార్తికేయ ఫేం చందు మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం ప్రేమమ్. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మలయాళంలో సంచలన విజయం సాధించిన ప్రేమమ్ చిత్రాన్ని తెలుగులో అదే టైటిల్ తో రీమేక్ చేస్తుండడం విశేషం. ఈ చిత్రంలో నాగ చైతన్య సరసన శృతిహాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ నటిస్తున్నారు. ఈ చిత్రం ఒక పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక అసలు విషయానికి వస్తే...నాగార్జున, అమల పెళ్లి రోజైన ఈ నెల 11న ప్రేమమ్ టీజర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇక ప్రేమమ్ చిత్రాన్ని ఆగష్టు 12న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com