చైతు ప్రేమమ్ ఫస్ట్ లుక్ డేట్
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న ప్రేమమ్ రీమేక్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని కార్తీకేయ ఫేం చందు మొండేటి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. మూడు ప్రేమకథలు ఉన్న ఈ సినిమాలో చైతన్య సరసన శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్ నటిస్తున్నారు.
రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను ఫిబ్రవరి 19న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాని జులైలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి..మలయాళంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రేమమ్ తెలుగులో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com