నాగేశ్వరరావు గారి ఆశీస్సులతో ప్రేమమ్ బిగ్ అవుతుంది - దర్శకరత్న దాసరి
Tuesday, September 20, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని నాగ చైతన్య హీరోగా కార్తికేయ ఫేమ్ చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ప్రేమమ్. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మలయాళ సంచలన చిత్రం ప్రేమమ్ చిత్రానికి రీమేక్ గా రూపొందిన ఈ చిత్రంలో నాగ చైతన్య సరసన శృతిహాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్ నటించారు. గోపీ సుందర్, రాజేష్ మురుగేషన్ సంగీతం అందించిన ప్రేమమ్ ఆడియో రిలీజ్ కార్యక్రమం అక్కినేని జయంతి పురస్కరించుకుని సినీ ప్రముఖులు, అక్కినేని వంశాభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకరత్న దాసరి నారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై బిగ్ సిడీని, ఆడియో సిడీను ఆవిష్కరించారు. అక్కినేని అఖిల్ ప్రేమమ్ థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేసారు.
ఈ సందర్భంగా నిర్మాత ఎం.ఎల్ కుమార్ చౌదరి మాట్లాడుతూ...అక్కినేని గారి జయంతి సందర్భంగా ప్రేమమ్ ఆడియో రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. నేను ఈ చిత్రంలోని రెండు సాంగ్స్ విన్నాను. ఈ రెండు సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈ చిత్రానికి నా ఫ్రెండ్ పి.డి.ప్రసాద్ సమర్పకుడు అనగానే చాలా హ్యాపీగా ఫీలయ్యాను. అక్కినేని నాగార్జునతో డాన్ సినిమా తీసాను. ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. నాగేశ్వరరావు గారిలా నాగార్జునలా చైతన్య మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా పెద్ద హిట్ అయి చైతన్య కి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను అన్నారు.
గీత రచయిత శ్రీమణి మాట్లాడుతూ...నా గురించి చెప్పాలంటే 100% లవ్ గురించి చెప్పాలి. నాగ చైతన్య సినిమా 100% లవ్ చిత్రం ద్వారానే గీత రచయితగా పరిచయం అయ్యాను. ఈ సినిమాలో ఎవరే... పాట, మచ్చి అనే పాట రాసాను. మైల్ స్టోన్ సాంగ్స్ చైతన్యకి రాసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ చిత్ర సంగీత దర్శకులు గోపీ సుందర్, రాజేష్ మురుగేషన్ కి థ్యాంక్స్ తెలియచేస్తున్నాను అన్నారు.
శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ...ఈ సినిమాలో అద్భుతమైన పాత్ర పోషించాను. చైతన్య, నేను ఎంజాయ్ చేస్తూ ఈ సినిమాలో నటించాం. ప్రేమమ్ అందరికీ నచ్చుతుంది అన్నారు.
ప్రవీణ్ మాట్లాడుతూ...ఈ చిత్రంలో చైతన్యకి మూడు లవ్ స్టోరీలు ఉన్నాయి. రెండు లవ్ స్టోరీస్ లో చైతన్య పక్కన ఫ్రెండ్ గా నటించాను. చైతన్య గురించి చెప్పాలంటే... ఎక్కువ మాట్లాడరు కానీ...ఈ సినిమా సెట్ లో ఎక్కువ మాట్లాడేవారు అన్నారు.
రాజేష్ మురుగేషన్ మాట్లాడుతూ...నన్ను ఈ వేడుకకు ఆహ్వానించినందుకు ఆనందంగా ఉంది. తెలుగు ప్రేక్షకులు నా సాంగ్స్ ని ఆదరించినందుకు హ్యాపీగా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ కి థ్యాంక్స్ తెలియచేస్తున్నాను అన్నారు.
అక్కినేని నాగార్జున మాట్లాడుతూ...ఈ రోజు నాన్నగారి పుట్టినరోజు. విషెష్ చెప్పిన అందరికీ థ్యాంక్స్. ఈ చిత్రంలోని ఎవరే పాట చైతన్య వినిపించినప్పటి నుంచి రోజు వింటూనే ఉంటాను. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రేమమ్ అంటే ఏమిటో మొన్నే తెలుసుకున్నాను. సంస్కృతంలో ప్రేమమ్ అంటే ప్రేమ అని అర్ధం అని తెలుసుకున్నాను. ఈ సినిమా కోసం చైతన్య గెడ్డం పెంచినప్పుడు నేను ఓం నమో వెంకటేశాయ కోసం గెడ్డం పెంచితే బాగుంటుంది అనిపించి గెడ్డం పెంచాను. ప్రేమకథా చిత్రాలును ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారు. నాన్నగారి దేవదాసు, ప్రేమనగర్, ప్రేమాభిషేకం, నేను నటించిన గీతాంజలి చిత్రాల్ని ఎంతగానో ఆదరించారు. ఆ చిత్రాలకు సరిపడే ప్రేమకథ చిత్రం ప్రేమమ్. మలయాళంలో ప్రేమమ్ సూపర్ హిట్ అయ్యింది. తెలుగులో కూడా ప్రేమమ్ సూపర్ హిట్ అవుతుంది అని నా నమ్మకం. ఈ చిత్రాన్ని సెన్సార్ పూర్తి చేసి అక్టోబర్ 7న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రేమమ్ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.
నిర్మాత పి.వి.పి మాట్లాడుతూ...ప్రేమ సినిమాలకు అక్కినేని కుటుంబానికి అవినాభవ సంబంధం ఉంది. ప్రేమాభిషేకం, మజ్ను చిత్రాల వలే ప్రేమమ్ చైతన్యకి మంచి హిట్ సినిమాగా నిలవాలి అన్నారు.
డైరెక్టర్ నందినీరెడ్డి మాట్లాడుతూ...ప్రేమమ్ సినిమాకి ఉన్న ఫ్యాన్స్ లో నేను ఒకదాన్ని. చందు ఈ సినిమాకి రైట్ డైరెక్టర్. ఏమాయచేసావే, 100% లవ్... ఇలా మంచి లవ్ స్టోరీస్ చైతన్య చేస్తున్నాడు. చైతన్యలో మంచితనంతో పాటు మంచిమనసు ఉంది. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడం కోసం వెయిట్ చేస్తున్నాను అన్నారు.
నిర్మాత దామోదర ప్రసాద్ మాట్లాడుతూ...అక్కినేని నాగేశ్వరరావు గారు, నాగార్జున గారు రొమాంటిక్ ఫిల్మ్స్ చేసారు. రొమాంటిక్ ఫిల్మ్స్ అందరూ హీరోలు చేస్తారు. అయితే... అక్కినేని హీరోలు చేస్తే స్పెషల్ గా ఉంటుంది. ప్రేమమ్ మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.
డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ...ప్రేమమ్ సినిమాని ప్రేమించింది ఫస్ట్ నాగచైతన్య. ఏమాయచేసావే తర్వాత మళ్లీ మంచి లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. లవ్ ఫీల్ అనే ఫ్లేవర్ మిస్ అవ్వకుండా చందు ఈ సినిమాని తెరకెక్కించారు. ఏమాత్రం రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. దసరాకి వస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అన్నారు.
హీరో నిఖిల్ మాట్లాడుతూ....మలయాళం ప్రేమమ్ కన్నా తెలుగు ప్రేమమ్ చాలా బాగుంటుంది. చందు ఇండస్ట్రీకి వచ్చిందే నాగార్జున గార్ని చూడడం కోసం. నేను ప్రేమమ్ సినిమా ఫ్యాన్ ని. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది అన్నారు.
డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ...లవ్ స్టోరీస్ చేయడంలో అక్కినేని గారు ఒక తరానికి స్పెషలిస్ట్. ఆతర్వాత నాగార్జున గారు ఎన్ని క్యారెక్టర్స్ చేసినా లవ్ స్టోరీస్ కి స్పెషలిస్ట్. అక్కినేని గారు, నాగార్జున గారు వలే చైతన్య ఈతరానికి లవ్ స్టోరీస్ కి స్పెషలిస్ట్ కావాలని కోరుకుంటున్నాను. రీమేక్ చేయడం అంటే చాలా కష్టం. చందు చాలా కష్టపడ్డాడు ఆ కష్టానికి తగ్గట్టు ప్రేమమ్ పెద్ద హిట్ అవ్వాలి అన్నారు.
అక్కినేని అఖిల్ మాట్లాడుతూ...మా అన్నయ్య ఫ్యూరిస్ట్ లవర్ ఇన్ ద వరల్డ్ అనిపిస్తుంది. సో...అన్నయ్యని ఫాలో అయిపోతాను. చందు కార్తికేయ చూసినప్పుడు భయమేసింది. మలయాళం ప్రేమమ్ చూడలేదు. ఈ సినిమాని బాగా తీసాడు అనుకుంటున్నాను. తాత గారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. శృతిహాసన్ టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.
దర్శకరత్న దాసరి నారాయణరావు మాట్లాడుతూ....80 సంవత్సరాల సినిమాల చరిత్రలో ఏ సినిమాకి లేని చరిత్ర ప్రేమాభిషేకం సినిమాది. ఇంకో 20 ఏళ్లు అలాగే కొనసాగితే 100 సంవత్సరాల రికార్డ్ ప్రేమాభిషేకం సొంతం అవుతుంది. ప్రేమ అనే పదానికి అర్ధం అక్కినేని కుటుంబం. కేరాఫ్ అడ్రస్ ఫర్ లవ్ స్టోరీస్. నాగార్జునతో మజ్ను సినిమా చేసాను. అది బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. అదే చరిత్ర చైతుతో పునరావృతం కాబోతుంది అఖిల్ తో కూడా కంటిన్యూ అవ్వాలి అని కోరుకుంటున్నాను. చైతును చూస్తుంటే హీరోలా అనిపించడు. మన పక్కంటి కుర్రాడు అనిపిస్తుంది. మొత్తం చైతు నవ్వులోనే ఉంది. ఇంకా చెప్పాలంటే ఆ నవ్వులో చాలా మాయ ఉంది. ఆ నవ్వుతోనే పడేసాడు హీరోయిన్ ని. అలాగే ఏమాయచేసావే తో ఏమాయ చేసిందో ఆ హీరోయిన్. చైతు ఎన్ని సినిమాలు చేసినా ఏమాయ చేసావే, 100% లవ్ చిత్రాలతో అక్కినేని వారసుడు అనిపించాడు. చైతు యాక్షన్ పిల్మ్స్ చేసినప్పుడు వద్దు లవ్ స్టోరీస్ చేయమని నాగ్ తో చెప్పాను. ఎందుకంటే ప్రేమకు మరణం లేదు. లవ్ స్టోరీస్ కి ఉన్న చరిత్ర ఏ సినిమాకి లేదు ఉండదు కూడా.
100 మందిని కొట్టడం కాదు రియలిస్టిక్ మనిషిగా 100 % అమ్మాయిల మనసు దోచుకునే కుర్రాడుగా చైతు ప్రేక్షకుల్లో అభిమానుల్లో చక్కని పేరు సంపాదించుకున్నాడు. నాగేశ్వరరావు గారి పుట్టినరోజున మా చినబాబు తీసిన సినిమా ఆడియో రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. శృతిహాసన్ ని చూసి కమల్ లాగా ఉంది అంటున్నారు కానీ... శృతి వాళ్ళ అమ్మ సారికలా ఉంది. నాతో ఐదు సినిమాలు చేసింది. చైతన్య, శృతిహాసన్ కాంబినేషన్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మడోనా చాలా చక్కగా పాడింది. ఇక డైరెక్టర్ చందు గురించి చెప్పాలంటే... అతని కార్తికేయ సినిమా చూసాను. డిఫరెంట్ డైరెక్టర్ బాగా హ్యాండిల్ చేసుంటాడు అనుకుంటున్నాను. రీమేక్ చేయడం అనేది చాలా కష్టం. కత్తిమీద సాము లాంటిది. మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ వండర్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్. ఊపిరి సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎక్స్ లెంట్ గా అందించాడు. నాగేశ్వరరావు గారి ఆశీస్సులతో ప్రేమమ్ బిగ్ హిట్ అవ్వాలని అఖిల్ లవ్ స్టోరీయే చేయాలని అది సిల్వర్ జూబ్లీ ఆడాలని కోరుకుంటున్నాను అన్నారు.
గోపీ సుందర్ మాట్లాడుతూ... ప్రేమమ్ సినిమాకి గ్రేట్ ఫ్యాన్ ని. రాజేష్ మురుగేషన్ చాలా మంచి ట్యూన్స్ అందించారు. సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.
గీత రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.... చైతు చాలా అందంగా ఉన్నారు. ప్రేమమ్ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. చందు క్లారిటి ఉన్న డైరెక్టర్. చాలా చక్కగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మంచి ఆల్బమ్ కుదిరింది. ఈ మూవీకి పని చేసే అవకాశం కల్పించిన డైరెక్టర్ & ప్రొడ్యూసర్ గార్కి థ్యాంక్స్ అన్నారు.
శృతి హాసన్ మాట్లాడుతూ...ఈ ఆడియో ఫంక్షన్ లో పాల్గొడం నాకు చాలా సంతోషంగా ఉంది.ఇది నాకు చాలా స్పెషల్ ఫిల్మ్. మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ బ్యూటీఫుల్ మ్యూజిక్ అందించారు. చైతన్య నాకు బెస్ట్ ఫ్రెండ్. చైతన్తోయ నటించినందుకు చాలా హ్యాపీగా ఫీలవుతున్నాను అన్నారు.
అక్కినేని నాగ చైతన్య మాట్లాడుతూ... సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సపోర్ట్ చేసేది మా అభిమానులే. తాత గారు జర్నీ స్టార్ట్ చేసారు. నాన్నగారు ఆ జర్నీని కంటిన్యూ చేసారు. మీ సపోర్ట్ తో నేను నాన్న గారి జర్నీని కంటిన్యూ చేస్తున్నాను. ప్రేమమ్ సినిమా బాగా ప్రేమించి చేసిన సినిమా. తెలుగు ఆడియోన్స్ కి నచ్చేలా తీద్దాం అని ఈ సినిమా చేసాం. ఈ సినిమా చేసేటప్పుడు అక్కడ ఉన్న ప్రతి టెక్నిషియన్స్ ని అప్రిషియేట్ చేసి ఈ సినిమా స్టార్ట్ చేసాం. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఈ సినిమా టెక్నీషియన్స్ ను అక్కడ ఉన్న టెక్నీషియన్స్ అప్రిషియేట్ చేస్తారు. మా డైరెక్టర్ చందు, నిర్మాత వంశీ ధ్యాంక్స్ కి థ్యాంక్స్ తెలియచేస్తున్నాను. చందుని రీమేక్ చేయమని అడగడం తప్పే. చందు ఎంత టాలెంటెడ్ డైరెక్టరో ఈ సినిమాకి వర్క్ చేస్తున్నప్పుడు తెలిసింది. ఈ సినిమా రిలీజ్ తర్వాత చందు కథతో సినిమా చేస్తాను. నాకు కథ నచ్చింది చేస్తావా అని చినబాబు గారు అడిగితే కథ వినకుండా సినిమా చేస్తాను. అక్టోబర్ 7 ప్రేమమ్ వస్తుంది. మనం అందరం గర్వంగా ఫీలయ్యే సినిమా అవుతుంది అన్నారు.
ఈ కార్యక్రమంలో బ్రహ్మాజీ, సుధీర్ వర్మ, సింగర్ శ్రీకృష్ణ, వనమాలి, మడోనా, డైరెక్టర్ చందు మొండేటి తదితరులు పాల్గొన్నారు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments