'ప్రేమమ్ ' తోనూ కంటిన్యూ చేస్తుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
తొలి అడుగుల్లోనే విజయాలు అందుకోవడం అంటే అంత ఈజీ కాదు. అయితే కేరళ కుట్టి మడోనా సెబాస్టియన్.. ఎక్కడ అడుగు పెట్టినా విజయం తన ఇంటిపేరుగా మార్చుకుంటోంది. గతేడాది తన మాతృభాష మలయాళంలో ' ప్రేమమ్'తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన మడోనాకి ఆ సినిమా శుభారంభాన్ని ఇచ్చింది. అందులో ఆమెది మూడో హీరోయిన్ వేషమే అయినా.. హీరోని పెళ్లాడే పాత్ర ఆమెదే కావడం.. ఆ పాత్ర ఎనర్జిటిక్‌గా ఉండడంతో మడోనాకి మంచి గుర్తింపే లభించింది. మలయాళంలో ఓ క్లాసిక్ సినిమాగా.. బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'ప్రేమమ్' పుణ్యమా అని మడోనాకి తమిళం, తెలుగు భాషల్లోనూ ఆఫర్లు వచ్చాయి.
ఈ నెలలోనే తమిళంలో మడోనా చేసిన తొలి చిత్రం విడుదలైంది. 'కాదల్ కడందు పోగుమ్' పేరుతో వచ్చిన ఆ సినిమా సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. అంటే.. మరో భాషలో మడోనాకి శుభారంభం దక్కిందన్నమాట. ఇక తెలుగులోనూ ఇదే ఫార్ములాని కొనసాగిస్తానన్న నమ్మకంతో ఉంది మడోనా. 'ప్రేమమ్'కి రీమేక్‌గా నాగచైతన్య నటిస్తున్న తెలుగు 'ప్రేమమ్'లోనూ మడోనా ఒరిజనల్ వెర్షన్లో చేసిన పాత్రనే చేస్తోంది. చూడబోతే.. ఇక్కడా మడోనాకి శుభారంభం దక్కేటట్టుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి మడోనా తన తొలి విజయాల పరంపరని..'ప్రేమమ్'తోనూ కంటిన్యూ చేస్తుందో లేదో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments