'ప్రేమకు రెయిన్ చెక్' టీజర్ లాంచ్
Send us your feedback to audioarticles@vaarta.com
"రెయిన్ చెక్" అంటే ఇచ్చిన ఆఫర్ ను భవిష్యత్ లో తీసుకుంటాను అని అర్ధం. ఇప్పుడిదే టైటిల్ గా ప్రముఖ నిర్మాణ సంస్థ నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో స్టోన్ మీడియా ఫిలిమ్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం "ప్రేమకు రెయిన్ చెక్".
ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ ట్రెండీ లవ్ స్టోరీని నార్త్ స్టార్ ఎంటర్ టైనెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత శరత్ మరార్ సమర్పిస్తుండడం విశేషం. అభిలాష్ వడాడ, ప్రియా వడ్లమాని, మౌనికా తమనం హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్ర లొగొ థీమ్ ను ప్రముఖ దర్శకులు ఇంద్రగంటి మోహనకృష్ణ , లిరికల్ వీడియో ను శరత్ మరార్ విడుదల చేశారు.
శరత్ మారార్ మాట్లాడుతూ.. టైటిల్ ఎంత ఫ్రేష్ గా ఉందో సినిమా కొత్తగా ఉంటుంది. ఆడియెన్స్ కు సరికొత్త ఫీల్ ను కల్గిస్తుంది. ఆకెళ్ల పేరి శ్రీనివాస్ గారు మంచి క్రియేటర్. మంచి టీమ్ ఈ సినిమాకు వర్క్ చేశారు. ఇంద్రగంటి గారు లాంఛ్ చేయటం అభినందనీయమన్నారు.
సంగీత దర్శకుడు దీపక్ కిరణ్ మాట్లాడుతూ... ఆకెళ్ల పేరి శ్రీనివాస్ గారి ఎనర్జీ వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. సంగీతానికి స్కోప్ ఉన్న స్క్రిప్ట్ ఇది. ఐదు వైవిధ్యమైన పాటలు ఉంటాయన్నారు. నాతో వర్క్ చేసిన లిరిసిస్ట్, సింగర్స్ కు ధన్యవాదాలన్నారు.
హీరో అభిలాష్ మాట్లాడుతూ.. నా తొలి సినిమా నార్త్ స్టార్ లో రావటం నా లక్. మా వర్క్ ఎంటనేది టీజర్ , లిరికల్ వీడియో లొ చూశారు. మా టీమ్ అందరం దిబెస్ట్ ఔట్పుట్ వచ్చెలా "ప్రేమకు రెయిన్ చెక్" కు వర్క్ చేశాం..దర్శకులు ఆకెళ్ల పేరి శ్రీనివాస్ గారు ఎంతో ఎంకరేజ్ చేశారు.మా వర్క్ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాము అన్నారు.
హీరోయిన్ ప్రియా మాట్లాడుతూ.. ఇంద్రగంటి గారు, శరత్ గారు సపోర్ట్ చెస్తున్నందుకు ధన్యవాదాలు. ఆకెళ్ల పేరి శ్రీనివాస్ గారు చాలా క్లారిటీగా ఈ సినిమా చేశారు. అందరికీ నచ్చుతుందని భావిస్తునాము.
ఆకెళ్ల పేరి శ్రీనివాస్ మాట్లాడుతూ... ఇంద్రగంటి గారు వచ్చి మా థీమ్ లోగో ని లాంచ్ చేసినందుకు చాలా సంతోషం గా ఉంది. శరత్ మరార్ గారు ఈ సినిమాను ప్రెజెంట్ చెస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఫీల్డ్ లో వర్క్ లో చెసె నేను, తొలిసారి సినిమా చెస్తున్నాను. కంటెంట్ ఇంపార్టెంట్. అలాగే సినిమాటిక్ ఎక్స్ పిరియన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. మా చిత్రంలో ఈ రెండు ఉంటాయి. టీమ్ వర్క్ మా సినిమాకు ప్రధాన బలం. డిఓపి శరత్ గారు మా సినిమాకు అల్టిమేట్ సినిమాటోగ్రఫీ అందించారు. దీపక్ సంగీతం, నటీనటుల పెర్ఫార్మెన్స్ ఇలా ప్రతి అంశం దిబెస్ట్ అన్పించెలా" ప్రేమకు రెయిన్ చెక్" ఉంటుంది. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదల చెస్తామన్నాము.
ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ.. ఆకెళ్ల పేరి శ్రీనివాస్ గారు నాకు గొల్కొండ హైస్కూల్ టైమ్ లో పరిచయం. టైటిల్ ఇంట్రెస్టింగ్గా ఉంది. టిక్నికల్ గా సినిమా వర్క్ చాలా బాగుంది. శరత్ మరార్ గారు ఈ సినిమాను విడుదల చెయటం గొప్ప విషయం. ఈ సినిమా టీమ్ అందరికీ సక్సెస్ ఇవ్వాలని ఆశిస్తున్నానన్నారు
అభిలాష్ వడాడ, ప్రియా వడ్లమాని, మౌనికా తవనం, సుమన్, రఘు కారుమంచి, కిరీటి దామరాజు, కల్కి తదితరులు నటిస్తున్నారు ఈ చిత్రానికి సంగీతం: దీపక్ కిరణ్, ఛాయాగ్రహణం: శరత్ గురువుగారి. సమర్పణ: నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్, రచన-దర్శకత్వం: ఆకెళ్ళ పేరి శ్రీనివాస్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments