'ప్రేమకు రెయిన్ చెక్' టైటిల్ లాంచ్

  • IndiaGlitz, [Saturday,July 14 2018]

ప్రముఖ నిర్మాణ సంస్థ నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో స్టోన్ మీడియా ఫిలిమ్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ప్రేమ రెయిన్ చెక్. రెయిన్ చెక్ అంటే ఇచ్చిన ఆఫర్ ను భవిష్యత్ లో తీసుకుంటాను అని అర్ధం. ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ ట్రెండీ లవ్ స్టోరీని నార్త్ స్టార్ ఎంటర్ టైనెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత శరత్ మరార్ సమర్పిస్తుండడం విశేషం. ఈ చిత్రం టైటిల్ లోగోను ఇవాళ విడుదల చేశారు.

ప్రొజెక్ట్ విక్టరీ అనే వర్కింగ్ టైటిల్ తో మొదలైన ఈ చిత్రం విడుదల తర్వాత ఆ వర్కింగ్ టైటిల్ ను జస్టిఫై చేస్తుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు చిత్రబృందం.

అభిలాష్ వడాడ, ప్రియా వడ్లమాని, మౌనికా తవనం హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రం టైటిల్ లోగో విడుదల సందర్భంగా చిత్ర దర్శకనిర్మాత ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఒక డిఫరెంట్ లవ్ స్టోరీగా ప్రేమకు రెయిన్ చెక్ చిత్రాన్ని తెరకెక్కుతోంది. ఒక ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ అయిన నేను సినిమా మీద ప్యాషన్ తో ఈ చిత్రం నిర్మించాను.

లైఫ్, కెరీర్ & రొమాన్స్ నేపధ్యంలో ఈ సినిమా ఉంటుంది. తిరస్కరించకుండా, ఒప్పుకోకుండా ప్రేమను పోస్ట్ పోన్ చేసి రెయిన్ చెక్ ఇచ్చిన పాత్రల కథ ఇది. త్వరలోనే ఫస్ట్ లుక్ ను విడుదల చేసి.. ఆగస్ట్ లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకోచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: దీపక్ కిరణ్, ఛాయాగ్రహణం: శరత్ గురువుగారి. సమర్పణ: నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్, రచన-దర్శకత్వం: ఆకెళ్ళ పేరి శ్రీనివాస్.

More News

'అంతర్వేదం' బృందం కష్టానికి తప్పకుండా తగిన ఫలితం దక్కుతుంది - తనికెళ్లభరణి

ఫ్రెండ్స్ ఫండింగ్ ఫిలిమ్స్ బ్యానర్ పై క్రౌడ్ ఫండ్ తో నిర్మించిన చిత్రం "అంతేర్వేదమ్" .చందిన రవికిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని

అల‌నాటి గాయ‌ని రాణి క‌న్నుమూత‌

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు న‌టించిన 'దేవ‌దాసు' సినిమాలో అంతా భ్రాంతియేనా... అనే పాట చాలా ఫేమ‌స్‌. ఈ పాట‌ను పాడిన గాయ‌ని రాణి. ఈమె హైద‌రాబాద్ క‌ల్యాణ్‌న‌గ‌ర్‌లో క‌న్నుమూశారు.

ఝాన్సీ గా వస్తున్న జ్యోతిక

స‌న్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ బాల సొంత ద‌ర్శ‌క‌,నిర్మాణంలో తెర‌కెక్కించిన  మూవీ నాచియార్. ఈ చిత్రాన్ని తెలుగు లో డి వెంకటేష్ డి వి సినీ క్రియేషన్స్ బ్యానర్ పై విడుదల కానుంది.

సీనియర్‌ నటుడు వినోద్‌ కన్నుమూత

300కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించిన క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ వినోద్(59) శ‌నివారం తెల్ల‌వారు జామున 2 గంట‌ల‌కు బ్రెయిన్ స్ట్రోక్‌తో క‌న్నుమూశారు.

యుక్రేయిన్‌కి కార్తి..

శుక్ర‌వారం విడుద‌లైన 'చిన‌బాబు' చిత్రంతో స‌క్సెస్ సాధించాడు హీరో  కార్తి. కుటుంబ క‌థా చిత్రంగా మంచి విజ‌యాన్ని అందుకున్నాడు కార్తి.