Prema Vimanan:కల్యాణ్ రామ్ ‘డెవిల్’ నిర్మాణ సంస్థ 'ప్రేమ విమానం' ట్రెయిలర్ ను ZEE5 విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
జాతీయము, అక్టోబరు 4, 2023: భారతదేశపు అతిపెద్ద హోమ్-గ్రోన్ వీడియో ప్రసార వేదిక మరియు బహుభాషా కథకుడు, ZEE5 ఎంతో-ఎదురుచూడబడుతున్న డైరెక్ట్-టు-డిజిటల్ చిత్రం ‘ప్రేమ విమానం’ ట్రెయిలర్ ను, చీర్స్ ఫౌండేషన్, హైదరాబాదు వద్ద, 50 మంది అనాధ పిల్లలు మరియు తారాగణం మరియు సిబ్బంది సమక్షములో విడుదల చేసింది. ఇది ఒక విమానములో ఆకాశములో ఎగరాలని తహతహాలాడే ఇద్దరు పిల్లలు మరియు ఇంటి నుండి దూరంగా విమానములో వెళ్ళిపోయి వేరే దేశములో సెటిల్ అవ్వాలని కోరుకునే ఇద్దరు ప్రేమికుల కథ. విధి ఆడిన వింతనాటకములో, ఈ జీవితాలు ఊహించని మలుపులు, హాస్యము, కన్నీళ్ళు మరియు ఆనందక్షణాల కలగలుపుతో వీరి జీవితాలు చిక్కుల్లో పడతాయి. సంతోష్ కట్టా దర్శకత్వం వహించిన ఈ ఫీల్-గుడ్ ఫ్యామిలీ ఎంటర్టెయినర్లో సంగీత్ శోభన్, శాన్వే మేఘన, దేవాంష్ నామా, అనిరుధ్ నామా, అనసూయ భరద్వాజ్ మరియు వెన్నెల కిశోర్ నటించారు మరియు ఈ చిత్రము అక్టోబరు 13, 2023 నుండి ZEE5 పై ప్రసారం అవుతుంది.
అభిషేక్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రము ప్రేక్షకులను వినోదాన్ని అందిస్తుంది మరియు ప్రేమ, ఆకాంక్షలు, నాటకము, ఆనందము మరియు రొమాన్స్ వంటి అనేక భావోద్వేగాల అడ్రినాలిక్ రైడ్ పై తీసుకెళ్తుంది. ఈ చిత్రము కనీసము ఆర్టిసి బస్సు కూడా లేని ఒక చిన్న మారుమూల గ్రామానికి చెందినప్పటికీ ఒక విమానం ఎక్కాలని కలలు కనే ఇద్దరు ఔత్సాహిక పిల్లల కథ. కొత్త జీవితాన్ని ఆరంభించుటకు అత్యవసరంగా విమానాన్ని ఎక్కవలసిన ఒక యువ జంటను వాళ్ళు అనుకోకుండా కలుస్తారు. ఒకరి కల మరియు మరొకరి అత్యవసర పరిస్థితి వలన అనివార్య పరిస్థితులు తలెత్తుతాయి. చివరికి ప్రేమ మరియు అనుబంధము వంటి భావనలు ఏర్పడి, ఈ ఆనందదాయకమైన, నవ్వులు పూయించిన ప్రయాణములో జీవితము కొత్త పుంతలు తొక్కుతుంది. హృదయాన్ని కదిలించే ఈ కథనము అక్టోబరు 13, 2023 నుండి ZEE5 పై ప్రీమియర్ గా ప్రసారం అవుతుంది కాబట్టి ఈ తేదీని గుర్తుంచుకోండి. ప్రేమ, కలలు మరియు విధి యొక్క ఈ అసాధారణ ప్రయాణాన్ని వదులుకోకండి!
నటుడు సంగీత్ శోభన్ ఇలా అన్నారు, “ZEE5 తో ఇది నా రెండవ ప్రాజెక్ట్ మరియు ఈసారి కలలు మరియు ప్రేమ భావనలను చూపించే ఒక అందమైన కథకోసం పనిచేశాను. ఈ చిత్రములో మణి పాత్ర పోషించి, ఒకరి కలలను వెంటాడడము మరియు ప్రేమించే వ్యక్తిని విశ్వసించడము అనే ఆలోచనకు కనెక్ట్ అయ్యాను. ఈ పాత్రలు ప్రయాణించే ప్రయాణము, జీవితము మాదిరిగానే అనేక మలుపులు తిరుగుతుంది. ప్రేక్షకులు మా పాత్రల కలలకు రిలేట్ చేసుకుంటారని మరియు వారి ప్రయాణములో ఒక ప్రేరణను పొందుతారని నేను ఆశిస్తున్నాను.
నటి శాన్వే మేఘన ఇలా అన్నారు, “ఒక నటిగా, ఈ పాత్ర యొక్క భావోద్వేగాలు నన్ను కదిలించాయి. ఈ చిత్రములో అభిత ఒక స్వాప్నికురాలు మరియు ఒక ప్రేమికురాలు మరియు మణితో ఆమె ప్రయాణం హృద్యంగా ఉంటుంది, అలాగే కొన్నిసార్లు, హృదయవిదారకంగా కూడా ఉంటుంది. మనందరము కలలు కని ఉంటాము మరియు అందరము ప్రేమలో ఉండి ఉంటాము, కాబట్టి ప్రేక్షకులమదిలో శాన్వే అనుభవించిన భావోద్వేగాలు ప్రతిధ్వనిస్తాయి అని నేను విశ్వసిస్తున్నాను. ఇది ప్రేమ, ఆశ మరియు కలల శక్తి గురించిన ఒక కథ.”.
నటి అనసూయ భరద్వాజ్ ఇలా అన్నారు, “ఈ ప్రాజెక్ట్ లో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఆకాంక్షలు, కలలు మరియు ప్రేమల కలయిక అయిన ప్రేమ విమానం చిత్రం ఒక అందమైన చిత్రము అని నేను భావిస్తున్నాను, అందుకని మీ ప్రియమైన వారితో ZEE5 పై ఈ చిత్రాన్ని చూడండి మరియు ఈ అందమైన భావనలను అనుభవించండి.”.
దర్శకుడు సంతోష్ కట్టా మాట్లాడుతూ, “ప్రేమ విమానం చిత్రము పరిశ్రమలో నేను దర్శకత్వం వహించిన నా మొదటి చిత్రముగా ఎప్పుడు నా హృదయానికి ప్రత్యేకమైనదిగా నిలుస్తుంది మరియు ఇటువంటి తారాగణముతో పనిచేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. విమానాల కోసం రాము మరియు లాచుల ఆకర్షణతో పాటు మణి మరియు అభితల ప్రయాణాన్ని చాలామంది తమ రిలేట్ చేసుకుంటారు అని నేను విశ్వసిస్తున్నాను. ఈ చిత్రాన్ని మేము మా మనఃపూర్వకంగా చేశాము మరియు ప్రపంచముతో దీనిని షేర్ చేసుకోవడానికి ఇంకా వేచి ఉండలేను” అన్నారు.
నిర్మాత అభిషేక్ నామా ఇలా అన్నారు, “ZEE5 తో కలిసి ‘ప్రేమ విమానం’ చిత్రాన్ని అందించుటకు మేమెంతో సంతోషిస్తున్నాము. ఈ చిత్రము కేవలం ఒక సినిమాటిక్ అనుభవం మాత్రమే కాదు, ఇది కలలు, ప్రేమ, ఆకాంక్షల అందమైన ప్రయణము మరియు ఆశ యొక్క శక్తి. జీవితము పట్ల ప్రజల ధృష్టికోణాన్ని మార్చే శక్తి ఉన్న ఇటువంటి హృద్యమైన కథనాలను అందించుటకు అభిషేక్ పిక్చర్స్ వద్ద మేము గర్విస్తున్నాము. ప్రేమ విమానంలో మా అబ్బాయిలు తొలిసారి నటిస్తున్నారని ప్రకటించుటకు నేనెంతో ఆనందిస్తున్నాను. చిత్రములో వారు నటించడము నాకెంతో ప్రత్యేకమైనది”.
అక్టోబరు 13, 2023 నుండిZEE5 పై ‘ప్రేమ విమానం’ ప్రీమియర్ గా ప్రసారం కావటానికి సిద్ధంగా ఉంది!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com