జీ5లో 50 మిలియ‌న్స్ స్ట్రీమింగ్ మినిట్స్‌ రాబట్టిన 'ప్రేమ విమానం'

  • IndiaGlitz, [Wednesday,October 25 2023]

దేశ వ్యాప్తంగా వైవిధ్యమైన కంటెంట్‌తో ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను కోరుకునే ప్రేక్షకుల‌ను మెప్పిస్తోన్న వ‌న్ అండ్ ఓన్లీ ఓటీటీ జీ5. తాజాగా అక్టోబ‌ర్ 13 నుంచి 'ప్రేమ విమానం’ సినిమా జీ5 లైబ్రరీలో భాగ‌మైంది. భారీ బడ్జెట్స్‌తో వైవిధ్యమైన సినిమాలను నిర్మిస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్, జీ5తో క‌లిసి ఈ వెబ్ ఫిల్మ్‌ను నిర్మించింది. విమానం ఎక్కాలని కలలు కనే ఇద్దరు చిన్న పిల్లలు.. కొత్త జీవితం కోసం విమానం ఎక్కి ఎక్కడికైనా వెళ్లిపోవాలనుకునే ప్రేమ జంట.. వీరితో ముడిపడిన జీవితాల్లో జరిగిన ఘటనలు.. వారి ప్రయాణంలో వచ్చే మలుపులు, సంతోషాలు, బాధలు, నవ్వులు ఇలా అన్నీ కూడా ప్రేక్షకులను మెప్పించేలా ఈ ఫీల్ గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను మేకర్స్ రూపొందించారు. అద్భుతమైన రెస్పాన్స్‌తో ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆద‌రించారు. విడుద‌లైన కొన్ని రోజుల్లోనే ఈ వెబ్ ఫిల్మ్ 50 మిలియ‌న్స్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను రాబ‌ట్టుకోవ‌టం విశేషం.

ఈ సంద‌ర్భంగా జీ5 ఇండియా చీఫ్ బిజినెస్ ఆఫీస‌ర్ మ‌నీష్ క‌ల్రా మాట్లాడుతూ ‘‘జీ 5ను తెలుగు ప్రేక్షకులు ఆద‌రిస్తోన్న తీరు గురించి ఎంత చెప్పినా త‌క్కువే. 'పులి మేక', 'వ్యవ‌స్థ', 'చిన్న ఫ్యామిలీ స్టోరీ', రీసెంట్‌గా వచ్చిన 'ప్రేమ విమానం' వ‌ర‌కు తెలుగు ఆడియెన్స్ త‌మ మ‌ద్దతుని తెలియ‌జేస్తూనే ఉన్నారు. 'ప్రేమ విమానం' సినిమా ఇప్పటికే 50 మిలియ‌న్స్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను రాబ‌ట్టుకోవ‌టం ఆనందంగా ఉంది. మంచి క‌థ‌, దానికి త‌గ్గట్టు న‌టీన‌టుల పెర్ఫామెన్స్‌లు అభిమానులను ఆక‌ట్టుకున్నాయి. ప్రేమ విమానం ఓ ఇన్‌స్పైరింగ్ స్టోరి. క‌లల‌ను నేర‌వేర్చుకోవాల‌నుకునే పిల్లలు, ప్రేమించి ఒక్కటవ్వాల‌నే యువ జంట‌.. ఇలాంటి ఇతివృత్తం ప్రేక్షుకులను ఎంతో ఆస‌క్తిక‌రంగా మెప్పించాయి. ఈ మూవీని తెలుగు ప్రేక్షకుల‌కు అందించినందుకు ఎంతో గ‌ర్వంగా ఉంది’’ అన్నారు.

ఈ మూవీలో సంగీత్ శోభన్, శాన్వీ మేఘన హీరో హీరోయిన్లుగా నటించారు. జీ5 ఓటీటీలో ఒక 'చిన్న ఫ్యామిలీ స్టోరీ' తరువాత 'ప్రేమ విమానం'తో మరో బ్లాక్ బ‌స్టర్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకున్నారు సంగీత్ శోభన్. ఈ చిత్రంలో చిన్న పిల్లలుగా నిర్మాత అభిషేక్ నామా తనయులు దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా అద్భుతంగా నటించారు. ఇక వెన్నెల కిషోర్, అనసూయ భరద్వాజ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ వెబ్ ఫిల్మ్‌కి సంతోష్ కటా దర్శకత్వం వహించగా.. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు. జగదీష్ చీకటి కెమెరామెన్‌గా పని చేశారు.

సాంకేతిక వర్గం..

సమర్పణ : దేవాన్ష్ నామా, నిర్మాణం అభిషేక్ పిక్చర్స్, జీ5, నిర్మాత: అభిషేక్ నామా, దర్శకత్వం: సంతోష్ కాటా, సంగీత దర్శకుడు: అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రాఫర్: జగదీష్‌ చీకటి, ఎడిటర్: అమర్ రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్: గంధి నడికుడికర్, సీఈఓ: వాసు పోతిని; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మోహిత్ రాల్యని, పి.ఆర్.ఒ: సురేంద్ర కుమార్ నాయుడు- ఫణి కందుకూరి(బియాండ్ మీడియా)

జీ5 ఓటీటీ గురించి..

తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ ఇలా ఇతర భాషల్లో ఉన్న గొప్ప కంటెంట్‌ను జీ5 నిత్యం ఆడియెన్స్‌కు అందిస్తూనే ఉంది. దేశ వ్యాప్తంగా జీ5కి మంచి కంటెంట్ అందిస్తుందనే పేరు ఉందన్న సంగతి తెలిసిందే. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మీద నిర్మించిన 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ', అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన 'లూసర్ 2', బీబీసీ స్టూడియో, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన గాలివాన, రెక్కి, హలో వరల్డ్, మా నీళ్ల ట్యాంక్, అహ నా పెళ్లంట, ఏటీఎం, పులి మేక వంటి ఎన్నో మంచి వెబ్ సిరీస్‌లను జీ5 అందించింది. ఇదే కోవలో అభిషేక్ పిక్చర్స్‌తో కలిసి ‘ప్రేమ విమానం’ అనే వెబ్ ఫిల్మ్‌ను రూపొందించి ప్రేక్షకులను ఎప్పటికప్పుడు అలరిస్తూనే ఉంది.

More News

CM Jagan:సుప్రీంకోర్టులో ఏపీ సీఎం జగన్‌కు షాక్.. అక్రమాస్తుల కేసులో సీబీఐకి నోటీసులు..

ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డికి సుప్రంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జగన్‌ అక్రమాస్తుల కేసులపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన

'కాలింగ్ సహస్త్ర' అంటున్న సుడిగాలి సుధీర్.. న‌వంబ‌ర్‌లో విడుద‌ల‌

బుల్లి తెర ప్రేక్షకుల‌ను అల‌రించి తిరుగులేని ఇమేజ్‌ను సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై కూడా అభిమానులను మెప్పిస్తున్నారు.

సామాజిక రథ చక్రాలు వస్తున్నాయి.. వైసీపీ బస్సు యాత్ర షెడ్యూల్ ఇదే..

ఎన్నికలు వేళ నిత్యం ప్రజల్లో ఉండేందుకు అధికార వైసీపీ ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే పలు కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరైన వైసీపీ..

Telangana Nominations:తెలంగాణలో మొదలైన నామినేషన్ల పర్వం.. ఈసారి కొత్త నిబంధనలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ప్రాంతీయ భాషల్లో సోనీ లివ్ 'మాస్టర్ చెఫ్ ఇండియా'... త్వరలో తమిళ్, తెలుగులో స్ట్రీమింగ్

ఓటీటీలు రంగ ప్రవేశం చేసిన తర్వాత రియాలిటీ షోలకు ఆదరణ పెరిగింది. గతంలోనే ఈ కార్యక్రమాలు వున్నప్పటికీ వాటికి సెలెక్డ్‌డ్ ఆడియన్స్ వుండేవారు.