అల్లు శిరీష్ మెడకు గాయం.. స్టైల్ కోసం అయితే కాదంట!
Send us your feedback to audioarticles@vaarta.com
అల్లు వారబ్బాయి అల్లు శిరీష్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు. తరచుగా అభిమానులతో టచ్ లో ఉంటూ తన విశేషాలని షేర్ చేస్తూ ఉంటాడు. హీరోగా శిరీష్ ఇప్పటికే పలు చిత్రాల్లో నటించాడు. కానీ కోరుకున్న పెద్ద విజయం ఇంకా శిరీష్ కు దక్కలేదు. ఈ ఏడాది ఎలాగైనా మంచి విజయం అందుకోవాలని శిరీష్ గట్టిగా ప్రయత్నిస్తున్నాడు.
తన తదుపరి చిత్రాల కోసం శిరీష్ జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. సిక్స్ ప్యాక్ బాడీ కోసం శిరీష్ హెవీ వర్కౌట్స్ చేస్తున్నాడు. తాజాగా శిరీష్ తన స్ట్రెంగ్త్ ట్రైనింగ్ లో భాగంగా మెడకు గాయమైనట్లు తెలిపాడు. దీనితో అల్లు శిరీష్ తన మెడకు నెక్ బ్రేస్ తో కనిపిస్తున్నాడు.
దీనిపై శిరీష్ ఫన్నీ కామెంట్ చేశాడు. 'స్టైల్ కోసం అయితే దీనిని ధరించలేదు.. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ లో గాయపడ్డాను' అని పోస్ట్ చేశాడు. దీనితో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇటీవల శిరీష్ తన సిక్స్ ప్యాక్ బాడీ పిక్స్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా అవి వైరల్ గా మారాయి.
ప్రస్తుతం శిరీష్ 'ప్రేమ కాదంట' అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. శిరీష్, అను మధ్య సాగే ఇంటెన్స్ రొమాన్స్ ఈ మూవీలో హైలైట్ కాబోతున్నట్లు తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments