'ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం' విడుదల వాయిదా!!
Send us your feedback to audioarticles@vaarta.com
పెద్ద చిత్రాలతో పోటీ పడి ప్రచారం నిర్వహిస్తూ.. విడుదల కోసం అందరూ ఎదురు చూసేలా ఆసక్తి రేకెత్తిస్తున్న "ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం" చిత్రం విడుదల కొన్ని ప్రత్యేక కారణాల వల్ల వాయిదా పడింది. ఈ చిత్రం ఈనెల 15 విడుదలకు సిద్ధమవ్వడం తెలిసిందే.
దర్శకనిర్మాత గోవర్ధన్ మాటాడుతూ.. ఇటీవల "పెంపక్" సినిమా కొందరు ప్రముఖులకు చూపించడం జరిగింది. 15 న పలు సినిమాలు వస్తుండడం, 21 మరియు 27 తారీఖుల్లో పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతుండడం దృష్ట్యా.. మా చిత్రాన్ని వాయిదా వేయవలసిందిగా వారు సూచించారు. మినిమం నాలుగైదు వారాలు ఆడే సత్తా ఉన్న మంచి సినిమాను రాంగ్ డేట్ లో రిలీజ్ చేసి కిల్ చేయవద్దన్నారు. ఈ సినిమా రూపకల్పన కోసం గత సంవత్సర కాలంగా కష్టపడుతున్న మేము.. సరైన రిలీజ్ డేట్ కోసం కేవలం మరి కొన్ని రోజులు ఆగడంలో తప్పులేదనిపించింది. అందుకే వాయిదా వేస్తున్నాం. రిలీజ్ డేట్ త్వరలోనే అనౌన్స్ చేస్తాం" అన్నారు.
చంద్రకాంత్, రాధిక మెహరోత్రా, పల్లవి డోరా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో తనికెళ్ళ భరణి, తులసి, జెమిని సురేష్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. థర్డ్ ఐ క్రియేషన్స్ పతాకంపై రఘురాం రొయ్యూరుతో కలిసి ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో గోవర్ధన్ నిర్మిస్తున్నారు!!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com