'ప్రేమ అంత ఈజీ కాదు' యూ సర్టిఫికెట్‌తో 29న రిలీజ్

  • IndiaGlitz, [Saturday,March 23 2019]

పారిజాత మూవీ క్రియేషన్స్‌ పతాకంపై రాజేష్‌కుమార్‌, ప్రజ్వాల్‌ జంటగా టి. అంజయ్య సమర్పణలో ఈశ్వర్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్రేమ అంత ఈజీ కాదు’. టి.నరేష్‌, టి.శ్రీధర్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ పారిజాత హోమ్స్ అండ్ డెవలపర్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ టీ అంజయ్య చిత్ర యూనిట్ సమక్షంలో విడుదల చేశారు.

అనంతరం, సమర్పకులు టీ అంజయ్య మాట్లాడుతూ.. ప్రేమ అంత ఈజీ కాదు సినిమాకు యూ సర్టిఫికెట్ వచ్చింది. మా సినిమా చూసి సెన్సార్ అధికారులు ప్రశంసల వర్షం కురిపించారు. మా చిత్రానికి యూ సర్టిఫికెట్ రావడం చాలా సంతోషంగా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులు చూసే విధంగా మా సినిమాను రూపొందించాం. అందుకు సెన్సార్ ప్రశంసలు లభించడం మాకు మరింత మనోధైర్యాన్ని ఇచ్చింది. మా సినిమా విజయం సాధిస్తుందనే అంశానికి మరింత విశ్వాసం కలిగింది అని అన్నారు.

హీరో రాజేష్‌కుమార్‌ మాట్లాడుతూ.. ప్రేమ అంత ఈజీ కాదు సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉంది. ఫ్యామిలీ అంతా చూసే విధంగా ఉన్న సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. యూ సర్టిఫికెట్ ఇస్తూ అభినందించారు. మహకవి శ్రీశ్రీ చెప్పిన ప్రకారం.. ‘ఏ నటుడు చేసిన రక్తి కట్టించే పాత్రలు ఉన్నాయి. పాత్ర అయినా రక్తికట్టించే నటులు ఉన్నారు’ అన్నారు. మా సినిమా రెండో వ్యాఖ్యకు సరిపోతుంది. చాలా కష్టపడి సినిమాను అద్భుతంగా తీసుకొచ్చాం. తప్పుకుండా విజయం సాధిస్తుందనే భరోసా ఉంది అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ.. ఈ రోజుల్లో యూ సర్టిఫికెట్ వచ్చే చిత్రాలు కనిపించడం లేదు. మా సినిమాకు యూ సర్టిఫికెట్ రావడం సంతోషంగా ఉంది. ప్రేమ అంత ఈజీ కాదు మా టైటిల్. అయితే మేము సిని నిర్మాణంలో దిగిన తర్వాత సినిమా తీయడం కూడా ఈజీ కాదు అని తెలిసింది. సినిమా మొదలైన తర్వాత కొందరు చాలా తప్పుగా మాట్లాడారు. ప్రసాద్ ల్యాబ్‌లో మురిగిపోయే మరో సినిమా అని కొందరు వాగారు. ఎవరైనా ఏదైనా చేస్తే సహకరించకపోయినా.. ఇలా దెబ్బ తీసే విధంగా మాట్లాడొద్దు. ఏదిఏమైనా మేము అనుకొన్న ప్లాన్ ప్రకారం మార్చి 29న రిలీజ్ చేస్తున్నాం అని అన్నారు.

నిర్మాతలు శ్రీధర్, నరేష్ మాట్లాడుతూ.. ‘ప్రేమ నేపథ్యంలో సాగే కథ ఇది. మనసుకి నచ్చిన వ్యక్తి ప్రేమను గెలుచుకోవడం ఎంత కష్టమో తెలిపే సినిమా ఇది. ఖోఖో’. ప్లాష్‌ న్యూస్‌, ‘వెతికా నేను నా ఇష్టంగా’ వంటి చిత్రాలతో నటుడిగా నిరూపించుకున్న రాజేష్‌కుమార్‌ ఇందులో అద్భుతంగా నటించారు. కన్నడలో మూడు విజయవంతమైన సినిమాల్లో నటించిన ప్రజ్వాల్‌ పువ్వామా ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తుంది’’ అని చెప్పారు.

నటీనటులు: ధనరాజ్‌, రాంప్రసాద్‌, ముక్తార్‌ఖాన్‌ నటించిన ఈ చిత్రానికి ఛాయగ్రహణం: చక్రి, సంగీతం: జై.యం, ఎడిటింగ్‌ : శ్రీనివాస్‌ కంబాల...

More News

సెన్సార్ కార్యక్రమాల్లో నిన్నే చూస్తూ.. ఏప్రిల్ విడుదల

వీరభద్ర క్రియేషన్స్ పతాకం పై నూతన నటీనటులు శ్రీకాంత్, నితిన్, హేమ‌ల‌త (బుజ్జి) హీరో, హీరోయిన్లుగా

మ‌ల్టీస్టార‌ర్ రీమేక్‌పై క్లారిటీ...

త‌మిళంలో విజ‌య‌వంత‌మైన `విక్ర‌మ్ వేద` చిత్రాన్ని తెలుగులో, హిందీలో రీమేక్ చేయాల‌ని చాలా ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి.

తండ్రి పాత్ర‌లో డైరెక్ట‌ర్‌...

ప్రేమ క‌థా చిత్రాల‌తో పాటు.. పోలీస్ ఆఫీస‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించ‌డంలో స్పెష‌లిస్ట్ అయిన గౌత‌మ్ మీన‌న్ ప‌లు చిత్రాల్లో చిన్న చిన్న పాత్ర‌ల్లో మెప్పించే ప్ర‌య‌త్నం చేశాడు.

రాజ‌శేఖ‌ర్ అల‌క‌...

మా ఎన్నిక‌ల్లో న‌రేష్ ప్యానెల్‌లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంగ్ పోటీ చేసిన డా.రాజ‌శేఖ‌ర్ స‌హా నరేష్ ప్యానెల్ ..

'మా' ప్రమాణోత్సవంలో హేమను అవమానించిన నరేశ్!

‘మా’  (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా గెలిచిన సీనియర్ నటి హేమ సత్తా ఏంటో చాటిన సంగతి తెలిసిందే.