2 రోజులుగా అంబులెన్స్‌లోనే నిండు గర్భిణి.. చివరకు..
Send us your feedback to audioarticles@vaarta.com
నిండు గర్భిణి.. అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన చికిత్స కోసం రెండు రోజుల పాటు అంబులెన్స్‌లోనే జంట నగరాల్లోని పలు హాస్పిటల్స్ తిరిగింది. ఎక్కడా బెడ్స్ ఖాళీ లేవు. దీంతో కడుపులోని బిడ్డ బయటి ప్రపంచాన్ని చూడకుండానే కన్నుమూసింది.
అసలు విషయంలోకి వెళితే.. మెదక్ జిల్లా పెద్ద శంకరంపేటకు చెందిన విజయ అనే నిండు గర్భిణి అనారోగ్యం కారణంగా సంగారెడ్డిలోని ఓ ఆసుపత్రిలో చేరారు. మూడు రోజుల చికిత్స అనంతరం అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో విజయను అంబులెన్స్‌లో జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, కూకట్పల్లి, సోమాజీగూడ తదితర ఏరియాలలోని ఆసుపత్రులన్నింటికీ తీసుకెళ్లారు. కానీ ఎక్కడికెళ్లినా బెడ్లు లేవని కనీసం ఆసుపత్రిలో కూడా జాయిన్ చేసుకోలేదు. ఇలా రెండు రోజుల పాటు అంబులెన్స్‌లోనే ఆసుపత్రిలన్నీ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. దీంతో కడుపులోనే బిడ్డ కన్నుమూసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments