దారుణం.. ప్రీతిరెడ్డిని నరికి సూట్‌కేసులో కుక్కిన మాజీ ప్రియుడు!?
Send us your feedback to audioarticles@vaarta.com
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో దారుణం చోటుచేసుకుంది. గత ఆదివారం హైదరాబాద్‌కు చెందిన డెంటల్ డాక్టర్ ప్రీతి రెడ్డి (32) ఆస్ట్రేలియాలో అదృశ్యమైన సంగతి తెలిసిందే. అయితే బుధవారం తెల్లవారుజామున ఆమె కారులోనే విగతజీవిగా ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఆమె మిస్ అయినట్లు ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారిస్తున్న క్రమంలో కారులోనే ఆమె మృతదేహం కనిపించడం గమనార్హం. కాగా.. కారులోని సూట్‌కేసులో ప్రీతిరెడ్డి మృతదేహం ముక్కలు ముక్కలుగా నరికేయబడి కుక్కిన స్థితిలో ఉండటాన్ని చూసి పోలీసులు షాక్ అయ్యారు. కత్తితో దాడిచేసిన కొందరు దుండగులు ఆమెను హత్యచేసి సూట్‌కేసులో కుక్కినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
ఎక్కడికెళ్లింది..!?
సెయింట్ లియోనార్డ్స్‌లో జరుగుతున్న ఓ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యేందుకు గత ఆదివారం ఇంటి నుంచి వెళ్లిన ప్రీతిరెడ్డి ఇంటికి తిరిగి రాలేదు. చివరిసారిగా కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఆమె 11 గంటల కల్లా ఇంటికి వచ్చేస్తానని చెప్పినట్లు సమాచారం. ప్రీతిరెడ్డి చివరిసారిగా సిడ్నీలోని ఓ రెస్టారెంట్ వద్ద కనిపించి.. ఆపై టిఫిన్ చేసి వస్తానని చెప్పిన ఎంతకీ రాకపోవడంతో ఆమె కుటుంబీకులు, స్నేహితులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు ఆమె కారులోని సూట్‌కేసులో ముక్కలు ముక్కలుగా ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. కుమార్తె విగతిజీవిగా ఉండటాన్ని చూసిన కుటుంబీకులు స్నేహితులు, కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు.
ఈ దారుణానికి ఒడిగట్టిందెవరు..?
ప్రీతిరెడ్డి మాజీ ప్రియుడు హర్షవర్ధనే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రీతిరెడ్డి మృతదేహం లభ్యమైన మరుసటి రోజే హర్షవర్ధన్ కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోవడం గమనార్హం. ప్రీతిరెడ్డి వ్యవహారంలో తనకు కఠినశిక్ష తప్పదని భావించి.. తనకు తానుగా రోడ్డు ప్రమాదం చేసుకొని చనిపోయింటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ రెండు మరణాలకు ఏదైనా సంబంధం ఉండొచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు.. ప్రీతిరెడ్డి తన మాజీ ప్రియుడైన హర్షవర్ధన్‌తో కలిసి చివరిసారిగా మెక్ డోనాల్డ్‌కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాాచారం తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout