టాలీవుడ్ షూటింగ్స్, షోలు ప్రారంభమైతే ఇలా చేయాల్సిందే!

  • IndiaGlitz, [Saturday,May 16 2020]

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో టాలీవుడ్ మొదలుకుని బాలీవుడ్, హాలీవుడ్ వరకూ ఎక్కడా సినిమా షూటింగ్స్ జరగట్లేదు. అంతేకాదు.. థియేటర్స్, సినిమా రిలీజ్‌లు కూడా జరగట్లేదు.. సర్వం బంద్ అయ్యాయ్. అయితే ఎల్లుండితో 3.0 లాక్ డౌన్ పూర్తి కానుండగా.. 4.0 కూడా కొన్ని సడలింపులతో షురూ కానుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ సడలింపుల్లో సినిమా షూటింగ్స్ చేసుకోవచ్చని ఉంటే మాత్రం ఇది కాస్త ఇండస్ట్రీకి ఉపశమనం కలిగించే విషయమే. వాస్తవానికి ఇప్పటికే టాలీవుడ్ సుమారు 2వేల కోట్ల రూపాయిలు నష్టాన్ని చవి చూసిందని తెలియవచ్చింది. అయితే టాలీవుడ్‌ సినిమాలకు షూటింగ్స్ జరుపుకోవచ్చని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కండిషన్స్‌తో కూడా సడలింపులు ఇస్తే పరిస్థితి ఏంటి..? ఎలా షూటింగ్స్ జరుగుతాయ్..? షూటింగ్స్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

ఇలా చేయాల్సిందే..!

- ప్రతి చిత్ర బృందం తప్పనిసరిగా హీరో, హీరోయిన్, దర్శకనిర్మాతలు మొదలుకుని లైట్ బాయ్‌ వరకూ అందరూ కరోనా పరీక్ష చేయించుకోవాల్సిందే.

- షూటింగ్ ప్రదేశంలో ప్రతి ఒక్కరూ కచ్చితంగా మాస్క్, శానిటైజర్ వాడాల్సిందే.

- ప్రాజెక్ట్ ప్రారంభించే ముందు ప్రతికూలతను పరీక్షించాల్సిందే

- సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే ముందు.. పూర్తయిన తర్వాత షూటింగ్ లొకేషన్స్ ఖచ్చితంగా శానిటైజ్ చేయాల్సిందే.

- షూటింగ్ ప్రాంతంతో పాటు వాడే ప్రతి వస్తువును (ఏదైనా సరే కెమెరా మొదలుకుని సెట్‌లో ఉన్న పనిముట్ల వరకూ) శానిటైజ్ చేసి తీరాల్సిందే

- మరీ ముఖ్యంగా సినిమా తారాగణం, సిబ్బంది షూట్ పూర్తయ్యే వరకు స్పాట్ దాటి వెళ్లకూడదు.

- అదే విధంగా షూటింగ్ అయ్యాక ఇంటికెళ్లాలి.. ఇతర ప్రదేశాలకు వెళ్లకుండా చూసుకోవాలి.. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలకు.. జనావాసం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు అస్సలే వెళ్లకూడదు.

- తారాగణం, సిబ్బంది బయటి వ్యక్తులు, స్నేహితులు, బంధువులను సినిమా సెట్స్ లేదా షూటింగ్స్ జరిగే ప్రదేశాలకు అనుమతించకూడదు. అలా చేస్తేనే సేఫ్ జోన్‌లో ఉన్నట్లే లేకుంటే కష్టాలు కొని తెచ్చుకున్నట్లే.

- ఈ ఏడాది మొత్తం తెలుగు రాష్ట్రాలకే చాలా వరకు షూటింగ్స్ పరిమితం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇలా చేసుకుంటేనే మంచిదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- ఇతర దేశాల్లో.. ఇతర రాష్ట్రాల్లో షూటింగ్స్‌కు చాలా వరకు అనుమతులు రావు.. దీనిపై దర్శకనిర్మాతలు ఆశలు వదులుకోవాల్సిందే.

- అన్నింటికంటే ముఖ్యంగా షూటింగ్‌లో పరిమిత సంఖ్యలో అనగా.. 200 మంది అవసరమయ్యే చోట 50 నుంచి 100 మంది మాత్రమే తీసుకోవాలి.

- ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలు షూటింగ్స్ జరిపేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.. లేకుంటే పెనుముప్పు వాటిల్లే అవకాశాలు చాలానే ఉంటాయ్.

సినిమాలు రిలీజ్ చేస్తే..

- ప్రస్తుతం దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో బస్సులు నడుస్తున్నాయ్. సీటు మార్చి సీటులో మాత్రమే ప్రయాణికులు పయనిస్తున్నారు. అదే విధానాన్ని సినిమా థియేటర్లలో కూడా అమలు కానుంది. అంటే ఒకటో సీటు బుక్ చేసుకుంటే రెండు ఖాళీ.. మూడు మాత్రమే బుక్ చేసుకోవాలి.

- రోజుకు నాలుగు ఆటలు బదులు కరోనా తర్వాత మూడు ఆటలే నడవనున్నాయ్. ఎందుకంటే షోకు.. షోకు మధ్యలోని గ్యాప్‌లోని సీట్లన్నీ శానిటైజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా కనీసం 10 నుంచి 15 నిమిషాలు సమయం పడుతుంది గునక మూడు ఆటలకు శానిటైజ్ చేసేకి చాలానే సమయం పడుతుంది.

- టికెట్స్ అన్నీ ఆన్‌లైన్‌లో మాత్రమే.. ఇక కాగితం రూపంలో ఉండవ్. ఈ విధానాన్ని ఎత్తేయాలని థియేటర్స్ యాజమాన్యాలు నిర్ణయించినట్లు తెలియవచ్చింది.

- మరీ ముఖ్యంగా.. థియేటర్స్‌లోకి ఎంట్రీ మొదలుకుని ఇంటర్వెల్‌లో తినుబండారాలు కొనుక్కోవడానికి.. బాత్రూమ్‌ వెళ్లినప్పుడు.. షో అయిపోయి బయటికెళ్లేటప్పుడు కచ్చితంగా భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు కచ్చితంగా చేసుకోవాల్సిందే. లేకుంటే పరిస్థితులు మారిపోతాయి.

వీటితో పాటు ఇంకా చాలా జాగ్రత్తలే తీసుకోవాలి. ఇప్పటికే కోలీవుడ్‌లో పోస్ట్ ప్రోడక్షన్ పనులకు కండిషన్స్‌తో కూడిన అనుమతులు ఇచ్చిన విషయం విదితమే. మరి టాలీవుడ్‌కు ఎప్పుడు అనుమతులు ఉంటాయో ఏంటో వేచి చూడాలి.

More News

నువ్ ఎవడివి నన్ను అడగడానికి.. అనసూయ ఆగ్రహం!

జ‌బ‌ర్‌ద‌స్త్ ప్రోగామ్‌తో పాపులారిటీ సంపాదించుకున్న యాంక‌ర్ అన‌సూయ భ‌ర‌ద్వాజ్ పుట్టిన‌రోజు నేడు(మే 15). ఈ సంద‌ర్భంగా అన‌సూయ కీస‌ర మండ‌లంలోని ప‌లువురు గ‌ర్భిణీల‌కు న్యూటిష‌న్

యంగ్ డైరెక్టర్ దుర్మరణం.. విషాదంలో శంకర్!

సినిమా ఇండస్ట్రీని విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఓ వైపు కరోనా మహమ్మారి భయం.. మరోవైపు ఇలా వరుస విషాదాలతో ఇండస్ట్రీ అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే పలువురు

ఏపీలో త్వరలో తెరుచుకోనున్న ప్రధాన దేవాలయాలు

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో యావత్ భారతదేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్నది. ఇప్పటి వరకూ 3.0 లాక్‌డౌన్లు పూర్తి కాగా రేపో ఎల్లుండో మరోసారి పొడిగింపు

థియేటర్లకు ఆదాయం పెరిగే ఐడియా ఇచ్చిన నాగ్ అశ్విన్!

సావిత్రి బయోపిక్ ‘మహానటి’ చిత్రంతో స్టార్ హోదా అందుకున్న యువ దర్శకుడు నాగ్ అశ్విన్ గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో ఆయన పేరు తెలుగు ఇండస్ట్రీలోనే కాదు

రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త..

భారతదేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటికే ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ పేరిట రూ.20 లక్షల కోట్లతో భారీ ప్యాకేజి ప్రకటించిన కేంద్రం..