'రైట్ రైట్' కి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ శుభాకాంక్షలు

  • IndiaGlitz, [Thursday,June 09 2016]

క్యూట్ హీరో సుమంత్ అశ్విన్ న‌టించిన తాజా చిత్రం 'రైట్ రైట్‌'. వ‌త్స‌వాయి వెంక‌టేశ్వ‌ర్లు సమర్పణలో మ‌ను ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ స‌త్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై జె.వంశీకృష్ణ నిర్మించిన ఈ చిత్రం రేపు (10.06.) విడుదల కానున్న విషయం తెలిసిందే. సుమంత్ అశ్విన్ స‌ర‌స‌న‌ పూజా జవేరి నాయిక‌గా న‌టించారు. బాహుబ‌లి' ఫేమ్ ప్ర‌భాక‌ర్ కీల‌క పాత్ర పోషించారు.
ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆకాంక్షించారు. సుమంత్ ఆర్ట్స్ పతాకంపై యమ్మెస్ రాజు నిర్మించిన 'వర్షం' ప్రభాస్ కెరీర్ కి కీలక మలుపైన విషయం తెలిసిందే. ఆ సినిమా అప్పట్నుంచీ ఆయనతో ప్రభాస్ కి మంచి అనుబంధం ఉంది. యమ్మెస్ రాజు తనయుడు సమంత్ అశ్విన్ ని తమ్ముడిలా భావిస్తారు ప్రభాస్. అందుకే 'రైట్ రైట్' ఘనవిజయం సాధించాలని ఫేస్ బుక్ ద్వారా శుభాకాంక్షలు అందజేశారు.

''Best wishes to Sumanth Ashwin, Prabhakar (Kalakeya), Manu, and Vamshi Krishna for their film Right Right that releases tomorrow'' అని ప్రభాస్ పేర్కొన్నారు.

More News

తేజు డైరెక్ట‌ర్ తో రామ్..

నేను శైల‌జ సినిమాతో స‌క్సెస్ సాధించిన ఎన‌ర్జిటిక్ హీరో రామ్ కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ తో ఓ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంట‌ర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తుంది. క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న‌ ఈ చిత్రంలో రామ్ స‌ర‌స‌న రాశీ ఖ‌న్నా హీరోయిన్ గా న‌టిస్తుంది.

నందు నూతన చిత్రం కన్నుల్లో నీ రూపమే

యంగ్ టాలెంటెడ్ హీరో నందు, కన్నడ భామ తేజస్వినీ ప్రకాష్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం క‌న్నుల్లో నీ రూప‌మే. నూతన దర్శకుడు బిక్స్ ఇరుసడ్ల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

సెన్సేషనల్ మూవీ 'దండుపాళ్యం-2' షూటింగ్ పూర్తి - ఆగస్ట్ లో రిలీజ్

వెంకట్ మూవీస్ పతాకంపై శ్రీనివాసరాజు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత వెంకట్ నిర్మించిన 'దండుపాళ్య' కన్నడలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా 30 కోట్లు కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.

గౌతమీపుత్ర శాతకర్ణి ఫ్రీ లుక్ రిలీజ్..

నందమూరి నట సింహం బాలకృష్ణ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి.ఈ చిత్రాన్ని క్రిష్ తెరకెక్కిస్తున్నారు. ఈనెల 10న బాలకృష్ణ పుట్టినరోజు.

విజ‌య్ తో న‌టించ‌డం ఓ మ‌ధుర జ్ఞాప‌కం - జ‌గ‌ప‌తి

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ -  జ‌గ‌ప‌తిబాబు కాంబినేష‌న్లో రూపొందుతున్నఓ భారీ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని భ‌ర‌త‌న్ ద‌ర్శ‌క‌త్వంలో వెంకట్రామ్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ భారీ చిత్రం హైద‌రాబాద్ షెడ్యూల్ ఈరోజు ప్రారంభ‌మైంది.