ఓ సినిమా మార్కెట్‌ను ఎవరూ డిసైడ్ చేయలేరు - ప్రవీణ్ సత్తారు
Send us your feedback to audioarticles@vaarta.com
డా.రాజశేఖర్ హీరోగా పవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'పిఎస్‌వి గరుడవేగ 126.18ఎం'. ఈ చిత్రంలో రాజశేఖర్ ఎన్.ఐ.ఎ. ఆఫీసర్‌గా కనిపిస్తారు. రాజశేఖర్ కెరీర్‌లోనే హయ్యుస్ట్ బడ్జెట్ వుూవీగా, టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో రూపొందిన ఈ చిత్రం నవంబర్ 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రవీణ్ సత్తారు సినిమా గురించి తెలియజేసిన విశేషాలు...
అసలు టైటిల్‌కు అర్థమేంటి?
'పిఎస్‌వి గరుడవేగ 126.18ఎం' సినిమా చేసిన తర్వాత నాకు ఓ డై హార్డ్ సినిమా చేసిన ఫీలింగ్ వచ్చింది. ఈ కథను రాజశేఖర్‌గారిని దృష్టిలో పెట్టుకుని తయారు చేసుకోలేదు. 2006లో ముందుగా కథను రాసుకున్నాను. రాజశేఖర్‌గారిని కలిసిన తర్వాత ఈ కథ అయితే ఆయనకి సూట్ అవుతుందనిపించింది. ఆయన ఏజ్‌కు, బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లు కథలో చిన్న చిన్న మార్పులు చేశాను. స్క్రిప్ట్‌కు సంబంధించిన టైటిల్‌నే పెట్టాం. ఇందులో 126.18ఎం అనేది ఇప్పటి సస్పెన్స్. అదేంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ఎన్ఐఏ డిపార్ట్‌మెంట్ ఆలోచన ఎందుకు వచ్చింది?
2008లో ముంబై కాల్పులు తర్వాత ఎన్ఐఏ రూపొందింది. ఇదొక సీక్రెట్ ఆపరేషన్ ఏజెన్సీ. ఈ డిపార్ట్మెంట్‌కు కచ్చితమైన సమయం అంటూ ఉండదు. దాని వల్ల ఎన్ఐఏ ఆఫీసర్ భార్యకు ఇబ్బంది కలుగుతుంది. అతని వ్యక్తిగత జీవితంలో సమస్యలు వస్తాయి. భార్య అతని నుండి విడిపోవాలని అనుకుంటుంది. అలాంటి సమయంలో నిరంజన్ అనే వ్యక్తి ప్రవేశిస్తాడు. అసలు నిరంజన్ ఎవరు? ఎన్ఐఏ ఆఫీసర్ జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంటుంది. ఒక పక్క వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిపరమైన జీవితాన్ని సదరు ఆఫీసర్ ఎలా మేనేజ్ చేశాడనేదే చిత్రం.
ముందుగా మీరు రాసుకున్న కథకు, ఇప్పటి కథకు ఎలాంటి మార్పులు చేశారు?
2006లో నేను కథ రాసుకున్నప్పుడు హీరో క్యారెక్టర్ సీఐ అనుకున్నాను. అయితే రాజశేఖర్‌గారికి కథ చెప్పిన తర్వాత దాన్ని ఎన్ఐఏ ఆఫీసర్‌గా మార్చి రాసుకున్నాను. ఎన్ఐఏ ఆఫీసర్స్ ఎలా ఉంటారో ఎవరికీ ఉంటారో ఎవరికీ తెలియదు కాబట్టి, నేను అక్కడ ఫ్రీ హ్యాండ్ తీసుకున్నాను. నేను ఇప్పటి వరకు చేసిన సినిమాలకు ఈ సినిమాకు చాలా డిఫరెంట్ మూవీ. ఇదొక యాక్షన్ మూవీ. మనం ఇమేజ్ చేసిన సన్నివేశాన్ని తెరపై తీసుకురావడంలో పెద్ద కిక్ ఉంటుంది. ఆ కిక్‌ను నేను ఎంజాయ్ చేశాను. యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించడం థ్రిల్లింగ్ గా ఉంది, భవిషత్తు లో మరిన్ని యాక్షన్ సినిమాలు తీయాలనుకుంటున్నాను. యాక్షన్ అనేది కథలో భాగంగా ఉంటుంది. ఎలా చేయాలనేది నేను ముందుగా, వివరంగా రాసుకున్నాను. అయితే ఎలా ఎగ్జిక్యూషన్ చేయాలనేది స్టంట్ మాస్టర్‌కి వదిలేశాను.
రాజశేఖర్‌పై అంత పెద్ద బడ్జెట్ మూవీ అంటే..రిస్క్ అనిపించలేదా?
సినిమా మార్కెట్‌ను ఎవరూ డిసైడ్ చేయలేరు. ఎందుకంటే `అర్జున్‌రెడ్డి` సినిమాను నాలుగు కోట్లు పెట్టి తీశారు. సినిమా 30 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే అర్జున్‌రెడ్డిని తీసే సమయంలో హీరోపై నాలుగు కోట్లు పెట్టి సినిమా తీయడం అంటే ఎంత రిస్కో ఆలోచించండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా బావుంటే చాలు. వందకోట్టు పెట్టి తీసిన సినిమా ఇవరై కోట్లు కూడా కలెక్ట్ చేయదు. అంటే ఇక్కడ హీరో, బడ్జెట్ విషయం కాదు, సినిమాలో విషయం వుందా? లేదా? అనేదే విషయం. తెలుగు సినిమాల్లోకి ఓ దర్శకుడు స్క్రిప్ట్ పట్టుకుని వస్తే, బడ్జెట్ ఎంత అని ముందుగా ఓ మూర్ఖపు ప్రశ్న వేస్తారు. నిర్మాతలు స్క్రిప్ట్ చదివి, ఏ క్యారెక్టర్‌కు ఏ యాక్టర్ కావాలి, ఎన్ని లొకేషన్స్ ఉన్నాయి. ఎన్ని రోజుల్లో తీయగలం. బడ్జెట్ ఎంత అవుతుందని అంచనా వేయాలి. బడ్జెట్‌కు, దర్శకుడికి సంబంధం ఉంటుందా? ఉండదు. లైన్ ప్రొడ్యూసర్స్‌కు ప్లానింగ్ ఉండాలి. నేను బడ్జెట్ ను అస్సలు పట్టించుకోను, కథను నమ్మి సినిమాను ప్రారంభిస్తాను, కథకు కావాల్సినవన్నీ ఉన్నాయా? లేదా? చూసుకుంటాను. సినిమా బాగా రావడానికి నావంతు ప్రయత్నం చేస్తాను. సినిమాకు స్క్రిప్ట్ లేకుంటే, బడ్జెట్‌పై కంట్రోల్ ఉండదు. మీరు చెబితే నమ్మరు కానీ, ఇప్పటి వరకు రాజశేఖర్‌గారు చేసిన ఏ సినిమాను బౌండెడ్ స్క్రిప్ట్ లేదు. తొలిసారిగా గరుడవేగ సినిమా స్టార్ట్ కావడానికి మూడు నెలల ముందు అందరికీ బౌండెడ్ స్క్రిప్ట్ ఇచ్చాం. స్క్రిప్ట్ ముందుగా రాసుకుంటే ఏం చేయాలనే దానిపై క్లారిటీ ఉంటుంది.
జార్జియాలో షూట్ చేయడానికి కారణమేంటి?
సినిమా మొత్తం ఇండియాలోనే జరుగుతుంది. అయితే ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను జార్జియా తీయడానికి కారణం ఇండియాలో పర్మిషన్స్ ఇవ్వకపోవడమే. ఉదాహరణకు శ్రీశైలం డ్యామ్‌పైన విమానం వెళ్లేటప్పుడు పది ప్యారా సూట్స్ దిగుతాయి. వైజాగ్ నుండి రెండు స్పీడ్ బోట్స్ తేవాలి. డ్యామ్‌పైన మిషన్ గన్‌తో షూట్ చేయాలి. డ్యామ్ లోపల పది బాంబ్స్ పేలుతాయి. ఇలాంటి యాక్షన్స్ సీన్స్ కోసమని మనకు పర్మిషన్ రాలేదు. దాంతో జార్జియాకు వెళ్లాం. ప్రపంచంలో నాలుగో ఎత్తైన డ్యామ్ జార్జియాలో ఉంది. అలాంటి డ్యామ్‌ను షూటింగ్ కోసం నాలుగు రోజులు మాకే కేటాయించారు. అయితే ప్రాపర్ ప్లాన్‌తో వెళ్లాం కాబట్టే అనుకున్న సమయంలో పూర్తి చేయగలిగాం.
సెన్సార్ వల్ల ఎదురైన సమస్యలేంటి?
నేను చేసిన ప్రతి సినిమాకు సెన్సార్ సమస్యలు ఎదురయ్యాయి. చందమామ కథలు సినిమాలో నరేష్‌గారు, ఆమనిగారు కిస్సింగ్ సీన్‌కు సెన్సార్ వాళ్లు అభ్యంతరం చెప్పి, లెంగ్త్ కట్ చేయమని అన్నారు. ఇద్దరు తోడు కోల్పోయిన వ్యక్తుల ఎమోషన్స్ అర్థం చేసుకోకుండా ఏదో గవర్నమెంట్ ఉద్యోగం చేసినట్టు భావిస్తున్నారు. అలాగే ఈ గరుడవేగ సినిమాకు కూడా పద్నాలుగు కట్స్ చెప్పారు. ఓ ఊహజనితమైన క్యారెక్టర్, గవర్నమెంట్ ఆఫీసర్ అయితే వారిని ఏం అనుకూడదని అభ్యంతరం చెప్పారు. ఒకప్పుడు విడుదలైన విజయవంతమైన `ప్రతి ఘటన` సినిమా ఇప్పుడు కనీసం విడుదలైయ్యేదా?.. అని చెప్పలేం. గవర్నమెంట్‌ను ఏమీ అడగకూడదనుకుంటే, ఇక ప్రెస్, మీడియా ఎందుకు, ప్రతి చిన్న విషయాన్ని మైక్రోస్కోప్‌లో పెట్టి చూస్తున్నారంటే భయపడుతున్నట్లే కదా.
తదుపరి చిత్రం...?
సుధీర్‌బాబుతో పుల్లెల గోపీచంద్‌గారి బయోపిక్‌ను తెరకెక్కించనున్నాం. మార్చి నుండి షూటింగ్ ఉంటుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments