ప్ర‌వీణ్ స‌త్తారు మ‌ల్టీస్టార‌ర్ మూవీ

  • IndiaGlitz, [Thursday,December 07 2017]

'చందమామ కథలు' సినిమాతో నేషనల్ అవార్డును గెలుచుకున్న డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు. తాజాగా 'పిఎస్‌వి గరుడవేగ 126.18ఎం' సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు ప్రవీణ్. దాదాపు 10 సంవత్సరాలుగా విజయం కోసం పరితపిస్తున్న డా. రాజశేఖర్ కి ఈ సినిమాతో సక్సెస్ ని అందించారు.

ఈ డైరెక్టర్ టేకింగ్ కి అందరూ ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ప్రవీణ్ తన అప్ కమింగ్ ప్రాజెక్టుని శ్రేష్ట్ మూవీస్ సంస్థ‌లో చేస్తున్నారు. ఇది నితిన్ హోం బ్యానర్ కావడం విశేషం. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ప్రవీణ్ కథను రెడీ చేసారు. ఇది ఒక మల్టీ స్టారర్ మూవీ. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోలు నటించే అవ‌కాశం ఉంద‌ట‌.

ఇప్పటికే నితిన్, రానా పేర్లు ఫైనల్ చేసార‌ని తెలిసింది. మరో హీరోగా నారా రోహిత్ పేరు పరిశీలనలో ఉంద‌ని స‌మాచారం. ఈ సినిమాకి '3 కజిన్స్' అనే పేరుని అనుకుంటున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి సంబంధించి మరింత అధికారిక సమాచారాన్ని త్వరలో వెల్లడించనుంది చిత్ర యూనిట్. కాగా, పుల్లెల గోపీచంద్ బ‌యోపిక్‌ని కూడా ప్ర‌వీణ్ తెర‌కెక్కించేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

More News

షూటింగ్ పూర్తి చేసుకున్న'ఏంసీఏ'..డిసెంబ‌ర్ 21న విడుద‌ల‌

నేచుర‌ల్ స్టార్ నాని, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కాంబినేష‌న్‌లో రూపొందుతోన్నసినిమా 'ఎం.సి.ఎ'. దిల్‌రాజు 'ఫిదా' చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు భానుమ‌తిగా ప‌రిచ‌య‌మైన సాయిప‌ల్ల‌వి ఎం.సి.ఎలో హీరోయిన్‌గా న‌టించింది.

'అజ్ఞాత‌వాసి` సెకండ్ సింగిల్ డేట్‌, ఆడియో డేట్‌

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మూడో చిత్రంగా 'అజ్ఞాతవాసి' సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జ‌రుపుకుంటోంది.

శర్వానంద్ సినిమా తప్పుకున్న నిత్యా?

‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టిన టాలెంటెడ్ హీరోయిన్ నిత్యా మీనన్. ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సినిమాలతో నటిగా తానేంటో నిరూపించుకుంది ఈ కేరళకుట్టి.

స‌మంత‌.. డ‌బుల్ ధ‌మాకా

యువ క‌థానాయకుడు నాగ‌చైత‌న్య‌ని ఇటీవ‌లే పెళ్లి చేసుకున్న స‌మంత‌.. మ‌ళ్లీ సినిమాల‌తో బిజీగా మారింది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో సినిమాలు చేస్తోంది.

హ‌లో.. ర‌మ్య‌కృష్ణ‌కి ఎంతో స్పెష‌ల్‌

ర‌మ్య‌కృష్ణ‌.. ఒక‌ప్పుడు గ్లామ‌ర్ హీరోయిన్‌. ఇప్పుడు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌. అయితే అప్పుడు.. ఇప్పుడు.. ఒక పాయింట్ మాత్రం కామ‌న్‌. అదేమిటంటే.. ఎలాంటి పాత్ర‌లోనైనా ఇట్టే ఒదిగిపోవ‌డం.