డిసెంబర్ 4న 'ప్రతిరోజు పండగే' ట్రైలర్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా, మారుతి దర్శకుడిగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో, బన్నీ వాస్ నిర్మాతగా, గ్లామర్ డాల్ రాశి ఖన్నా హీరోయిన్ గా రూపొందిస్తున్న భారీ చిత్రం “ప్రతిరోజు పండగే”. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈసినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఇక ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 4న ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్టు దర్శకుడు మారుతి తెలిపారు. ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు... ప్రతి ఒక్కరు హాయిగా ఎంజాయ్ చేసే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. సాయి తేజ్ ను కొత్త రకమైన పాత్ర చిత్రణతో, న్యూ లుక్ లో చూపించబోతున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే కుటుంబ బంధాల్ని, విలువల్ని ఎమోషనల్ గా చిత్రీకరించనున్నారు.
GA2UV పిక్చర్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని గ్రాండియర్ గా నిర్మిస్తున్నారు. కట్టప్పగా తెలుగు ప్రేక్షకులకి మరింత చేరువైన ప్రముఖ నటులు సత్యరాజ్ క్యారెక్టర్ ని ఈ సినిమా దర్శకులు మారుతి ప్రత్యేకంగా డిజైన్ చేశారు. అలానే ఈ సినిమాలో నటిస్తున్న మరో నటుడు రావు రమేశ్ పాత్ర కూడా హైలెట్ గా ఉండనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments