డిసెంబర్ 4న 'ప్రతిరోజు పండగే' ట్రైలర్  విడుదల

  • IndiaGlitz, [Tuesday,December 03 2019]

సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా, మారుతి దర్శకుడిగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో, బన్నీ వాస్ నిర్మాతగా, గ్లామర్ డాల్ రాశి ఖన్నా హీరోయిన్ గా రూపొందిస్తున్న భారీ చిత్రం “ప్రతిరోజు పండగే”. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈసినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఇక ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 4న ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్టు దర్శకుడు మారుతి తెలిపారు. ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు... ప్రతి ఒక్కరు హాయిగా ఎంజాయ్ చేసే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. సాయి తేజ్ ను కొత్త రకమైన పాత్ర చిత్రణతో, న్యూ లుక్ లో చూపించబోతున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే కుటుంబ బంధాల్ని, విలువల్ని ఎమోషనల్ గా చిత్రీకరించనున్నారు.

GA2UV పిక్చర్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని గ్రాండియర్ గా నిర్మిస్తున్నారు. క‌ట్ట‌ప్ప‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కి మరింత చేరువైన ప్ర‌ముఖ న‌టులు స‌త్య‌రాజ్ క్యారెక్ట‌ర్ ని ఈ సినిమా ద‌ర్శ‌కులు మారుతి ప్ర‌త్యేకంగా డిజైన్ చేశారు. అలానే ఈ సినిమాలో న‌టిస్తున్న మ‌రో న‌టుడు రావు ర‌మేశ్ పాత్ర కూడా హైలెట్ గా ఉండ‌నుంది.

More News

దిశ ఘటన: వాళ్లేం పెద్ద క్రిమినల్స్ కాదు: పోసాని

వెటర్నరీ డాక్టర్ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ హత్యకేసులో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కరీంనగర్ లో ఘనంగా జరిగిన 90ml ప్రీ రిలీజ్ ఈవెంట్!!

‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో హీరోగా యువతలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ ఇప్పుడు 90ML తో

వైఎస్ జగన్, కేటీఆర్, కేసీఆర్.. కేంద్రమా ఎందుకిలా!?

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అపాయిట్మెంట్ ఇవ్వలేదా..? సోమవారం రాత్రి నుంచి కేసీఆర్ ఢిల్లీలో తి

'విట్టల్ వాడి' ట్రైలర్ రిలీజ్ చేసిన వినాయక్

రోహిత్,సుధా రావత్ హీరో హీరోయిన్లు గా ఎన్.ఎన్.ఎక్స్పీరియన్స్ ఫిలిమ్స్  బ్యానర్ లో జి.నరేష్ రెడ్డి నిర్మించిన చిత్రం విట్టల్ వాడి.

‘విక్రమ్’ ల్యాండర్ జాడ తెలిసింది.. కనిపెట్టింది మనోడే!

ఇస్రో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2లో భాగంగా విక్రమ్ ల్యాండర్‌ను చంద్రుడిపైకి పంపగా.. అది కుప్పకూలిన విషయం విదితమే.