పనులతో బిజీగా మారడం, పని ఒత్తిడి కారణంగా తల్లిదండ్రులను పిల్లలు నిర్లక్ష్యం చేస్తుంటారు. విదేశాల్లో ఉండే పిల్లలు వారిని చూడటానికి కూడా రారు. ఈ పాయింట్‌ను ఆధారంగా చేసుకుని దర్శకుడు మారుతి తెరకెక్కించిన చిత్రం `ప్రతిరోజూ పండగే`. సక్సె్స్ అవసరం అయిన పరిస్థితుల్లో డైరెక్టర్ మారుతి, చిత్రలహరి సక్సెస్ తర్వాత హీరో సాయితేజ్ కలిసి చేసిన ఈ సినిమాలో బంధాలు, అనుబంధాలు గురించి ఏం చూపించారు. అనే సంగతి తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళదాం...
కథ:
రాజమండ్రిలో ఉండే రఘురామయ్య(సత్యరాజ్) ముగ్గురు కొడులు, కూతురు ఆయనకు దూరంగా ఉంటారు. ఇద్దరు కొడుకులు విదేశాల్లో ఉంటే.. మరో కొడుకు సిటీలో వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగా రఘురామయ్య ఎక్కువ రోజులు బ్రతకడని డాక్టర్ చెబుతాడు. దాంతో అమెరికాలో ఉండే పెద్ద మనవడు సాయి(సాయితేజ్) తాతయ్య కోసం రాజమండ్రి వచ్చేస్తాడు. తాతయ్య కోరిక ప్రకారం ఆయన స్నేహితురాలి మనవరాలు ఎంజెల్ అర్ణ(రాశీఖన్నా)ని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. విషయం తెలిసిన రఘురామయ్య పెద్ద కొడుకు (రావు రమేష్) రాజమండ్రి వస్తాడు. మిగిలిన కుటుంబ సభ్యులు కూడా రాజమండ్రి చేరుకుంటారు. రఘురామయ్య సంతోషంగా కాలం వెల్లదీస్తుంటాడు. విదేశాల్లో ఉండే కొడుకులు, కూతురు రఘురామయ్య ఆరోగ్యపరిస్థితిపై ఏమంటారు? ఆయన్ని ఎందుకు విడిచిపెట్టి వెళ్లిపోతారు? తాతయ్య కోసం సాయి ఏం చేస్తాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
సమీక్ష:
సంతోషంగా ఉంటే ప్రతిరోజూ పండగే.. కుటుంబాల్లో బంధాలు, అనుబంధాలు ఎంతో ముఖ్యం అనే పాయింట్‌ను ఆధారంగా చేసుకుని దర్శకుడు మారుతి, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే పిల్లలుఉ అనే అంశాలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా కథను రాసుకున్నాడు. కామెడీ సన్నివేశాలను తెరకెక్కించడంలో మారుతి దిట్ట. కాబట్టి ఎమోషనల్‌గా సాగే అంశాలతో పాటు కామెడీ మిక్స్ చేసి సన్నివేశాలను అద్భుతంగా రాసుకున్నారు. పాత్రలను చక్కగా డిజైన్ చేసుకున్నారు. సినిమా అంతా సత్యరాజ్ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. రఘురామయ్య పాత్రధారిగా సత్యరాజ్ పాత్రలో ఒదిగిపోయాడు. ఇక సినిమాలో మరో ప్రధానమైన పాత్ర రావు రమేష్‌ది. సినిమాలో కామెడీ ట్రాక్‌ను తనదైన నటనతో మరో లెవల్‌కి తీసుకెళ్లాడు. సినిమాను తన భుజాలపై మోశాడనే చెప్పాలి. ఆ పాత్రను రావు రమేష్ తప్ప మరెవరూ చేయలేరనే రీతిలో ఆయన నటించాడు. ఇక కథను నమ్మి హీరోగా నటించిన సాయితేజ్ డేడికేషన్ తెరపై కనపడుతుంది. ముఖ్యంగా ఫైట్ సీన్స్‌లో నటించడానికి సిక్స్ ప్యాక్ చేయడం తన డేడికేషన్‌ను ఎలివేట్ చేస్తుంది. ఇక ఎంజల్ అర్ణ పాత్రలో రాశీఖన్నా కామెడీ ఆకట్టుకుంటుంది. ఫస్టాఫ్ ప్రథమార్థంలో ఈమె పాత్ర చేసే కామెడీ ప్రేక్షకులను మెప్పిస్తుంది. టిక్ టాక్ సెలబ్రిటీ పాత్రలో రాశీఖన్నా నటన బావుంది. ఇక విజయ్‌కుమార్, మురళీశర్మ, హరితేజ, ప్రవీణ్, భద్రమ్ తదితరులు వారి వారి పాత్రల్లో చక్కగా నటించారు. తమన్ సంగీతంలో రెండు సాంగ్స్ బావున్నాయి. నేపథ్య సంగీతం బావుంది. జయకుమార్ కెమెరా పనితనం బావుంది. ఎడిటింగ్ కూడా షార్ప్‌గా ఉంది. అయితే కథలో కొత్తదనం లేకపోవడం.. బలమైన ఎమోషన్స్ లేకపోగ, ఉన్న ఎమోషన్స్ కూడా ఫోర్స్‌డ్‌గా ఉన్నాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాలను ఎంజాయ్ చేయాలనుకునే ప్రేక్షకులు సినిమాను ఓ సారి చూడొచ్చు.
చివరగా.. ఆకట్టుకునే కామెడీ.. బలవంతమైన ఎమోషన్స్ కలయిక 'ప్రతిరోజూ పండగే'
Comments