5 లక్షల విలువైన హెల్త్ కార్డు లను అందజేసిన ప్రతాని
- IndiaGlitz, [Wednesday,May 10 2017]
చిన్న చిత్రాల నిర్మాతలకు అండగా నిలిచి , కార్మికుల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ధీరోదాత్తుడు ప్రతాని రామకృష్ణా గౌడ్ తాజాగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో 24 క్రాఫ్ట్స్ లో ఉన్న సాంకేతిక నిపుణులకు , నటీనటులకు ప్రభుత్వ సహాయంతో 5 లక్షల విలువైన హెల్త్ కార్డు ని అందించాడు . ఈ హెల్త్ కార్డు వల్ల ఆరోగ్య భద్రత మాత్రమే కాకుండా ఇతర సౌలభ్యాలను కూడా కల్పిస్తున్నాడు . హై స్కూల్ స్థాయి పిల్లలకు స్కాలర్ షిప్ కూడా వచ్చే ఏర్పాటు చేస్తున్నాడు ప్రతాని అంతేనా ....... తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో సభ్యులు ఎవరైనా ఇల్లు కట్టుకుంటే వాళ్లకు లక్షా యాభై వేల రూపాయలు వచ్చే ఏర్పాటు కూడా చేస్తున్నాడు . రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ ఫిలిం ఛాంబర్ చేయని పని ఒక్క ప్రతాని రామకృష్ణా గౌడ్ నేతృత్వం లోని ఛాంబర్ మాత్రమే చేస్తోంది . సినీ కార్మికులకు అందరికీ హెల్త్ కార్డు ఇవ్వడమే కాకుండా సినిమా పరిశ్రమలో భాగమైన ఫిలిం జర్నలిస్టు లకు సైతం దాదాపు వంద మందికి పూర్తిగా ఉచితంగా హెల్త్ కార్డు అందించడం జరిగింది .
సినీ కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ఏర్పడిన తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరో అడుగు ముందుకేసి దాదాపు 5 వేలమందికి సొంతింటి కల నెరవేరేలా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు . ఇల్లు లేని ప్రతీ ఆర్టిస్ట్ కి , టెక్నీషియన్ కి ఇల్లు సమకూరేలా త్వరలో కట్టబోయే చిత్రపురి కాలనీ లో మా వాటా కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు మా అధ్యక్షులు ప్రతాని రామకృష్ణా గౌడ్ అంటూ ప్రతాని పై ప్రశంసల వర్షం కురిపించింది తెలంగాణ మూవీ అండ్ టివి ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షురాలు కవిత .
ఫిలిం ఛాంబర్ అనగానే భారీ భవంతులు కట్టడం కాదని , సినీ కార్మికుల సంక్షేమమే ప్రధానమని అదే మా లక్ష్యమని అన్నారు ప్రతాని రామకృష్ణ గౌడ్ . ఈ సందర్బంగా టి ఎఫ్ సిసి లో జరిగిన ఓ కార్యక్రమంలో ఫైట్ మాస్టర్ కన్నబాబు , నటి శివలీల , కెమెరామెన్ సాయినాధ్ , అసిస్టెంట్ కెమెరామెన్ రాంరెడ్డి , ఫోటోగ్రాఫర్ ఆర్కే చౌదరి లకు అయిదు లక్షల విలువైన హెల్త్ కార్డు అను అందజేశారు ప్రతాని , కవిత లు .