సీనియ‌ర్ నిర్మాత రాఘ‌వ క‌న్నుమూత‌

  • IndiaGlitz, [Tuesday,July 31 2018]

ప్ర‌తాప్ ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత, ప్ర‌ముఖ నిర్మాత కోటిప‌ల్లి రాఘ‌వ మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లోని ఆయ‌న స్వ‌గృహంలో గుండెపోటుతో క‌న్నుమూశారు. తూర్పు గోదావ‌రి జిల్లా కోటిప‌ల్లి గ్రామంలో 1913 డిసెంబ‌ర్ 9న ఈయ‌న జ‌న్మించారు. 30 పైగా చిత్రాల‌కు రాఘ‌వ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. 'తాత మ‌న‌వ‌డు, సంసారం సాగ‌రం' చిత్రాల‌కు నంది అవార్డుల‌ను కూడా అందుకున్నారు.

ర‌ఘుప‌తి వెంక‌య్య‌, అక్కినేని జీవిత సాఫ‌ల్య పుర‌స్కారాలు ఈయ‌న సొంతం. ద‌ర్శ‌కర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు, కోడిరామ‌కృష్ణ‌, రావు గోపాల‌రావు, ఎస్‌.పి.బాల‌సుబ్ర‌మ‌ణ్యం, సుమ‌న్‌, బానుచంద‌ర్ వంటి వారిని ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసిన నిర్మాత ఈయ‌నే. జూబ్లీహిల్స్‌లోని మ‌హా ప్ర‌స్థానంలో అంత్ర‌క్రియ‌లు జ‌రుగ‌నున్నాయి.