ఏ కులాన్ని తక్కువ చేసి చూపించట్లేదు: ‘జాంబీ రెడ్డి’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ
Send us your feedback to audioarticles@vaarta.com
జాతీయ అవార్డు పొందిన 'అ!' చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ ‘కల్కి తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని తన మూడో సినిమాను రూపొందిస్తున్నారు. నిజ జీవిత ఘటనలను ఆధారం చేసుకొని తీస్తున్న ఈ చిత్రానికి 'జాంబీ రెడ్డి' అనే టైటిల్‌ను ప్రకటించారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగోను ప్రశాంత్ వర్మ రిలీజ్ చేశారు. ఇది ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. కొంతమంది 'జాంబీ రెడ్డి' టైటిల్‌ను ఒక కమ్యూనిటీకి ఆపాదించి, తప్పుగా అర్థం చేసుకుంటున్నట్టు టీమ్ దృష్టికి వచ్చింది. దీనిపై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వివరణ ఇచ్చారు.
‘‘ఇటీవల మా సినిమా టైటిల్ 'జాంబీ రెడ్డి' అని ప్రకటించాం. దానికి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ట్విట్టర్‌లో జాతీయ స్థాయిలో ట్రెండింగ్ అయ్యింది. టైటిల్ చాలా బాగుందంటూ చాలా కాల్స్, మెసేజ్‌స్ వచ్చాయి. మీమ్స్ కూడా వచ్చాయి. సినిమాకు అది యాప్ట్ టైటిల్. యానిమేషన్ చాలా బాగుందంటున్నారు. దానిపై మూడు నెలలకు పైగానే వర్క్ చేశాం. టీమ్ పడిన కష్టానికి వచ్చిన రిజల్ట్‌తో మేమంతా హ్యాపీగా ఉన్నాం. కొంతమంది మాత్రం టైటిల్‌ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. సినిమాలో ఎవరినీ తక్కువ చేసి చూపించడం, ప్రత్యేకించి ఒక కమ్యూనిటీని తక్కువ చేసి చూపించడం ఉండదు. ఇదొక ఎంటర్‌టైన్‌మెంట్ ఫిల్మ్. ప్రస్తుతం మనం చూస్తున్న కరోనా మహమ్మారి చుట్టూ జరిగే, కర్నూలు బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథ.
హాలీవుడ్‌లో ఈ రకం ఎపిడెమిక్ ఫిలిమ్స్ చూస్తుంటాం. అక్కడ న్యూయార్క్ లాంటి బ్యాక్‌డ్రాప్‌లో ఆ కథ జరిగినట్లు చూపిస్తుంటారు. నేను కర్నూలును బ్యాక్‌డ్రాప్‌గా ఎంచుకున్నాను. కర్నూలులో ఇలాంటి మహమ్మారి తలెత్తితే, అక్కడి ప్రజలు ఎలా ఫైట్ చేసి, ఈ మహమ్మారిని నిరోధించి, ప్రపంచాన్నంతా కాపాడతారన్నది ఇందులోని ప్రధానాంశం. కర్నూలును కథ ఎంత హైలైట్ చేస్తుందో సినిమా చూస్తే తెలుస్తుంది. దయచేసి టైటిల్‌ను తప్పుగా ఊహించుకోవద్దు. ఏ కులాన్నీ తక్కువచేసి చూపించడం అనేది కచ్చితంగా ఈ సినిమాలో ఉండదు. నా ఫస్ట్ ఫిల్మ్ 'అ!'కు జాతీయ స్థాయి గుర్తింపు వస్తే, ఈ సినిమాకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వస్తుందని నమ్ముతున్నాను. అందరూ గర్వంగా ఫీలవుతారు." అని ఆయన వివరించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments