‘స‌లార్‌’ .. ప్ర‌శాంత్ నీల్ స్పీడు మామూలుగా లేదుగా..!

ప్ర‌భాస్ ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిన త‌ర్వాత ఆయ‌న కోసం ద‌ర్శ‌క నిర్మాత‌లు క్యూ క‌డుతున్నారు. ఇప్ప‌టికే నాలుగు ప్యాన్ ఇండియా సినిమాలు అనౌన్స్ చేశాడు ప్ర‌భాస్‌. అందులో ముందుగా ‘రాధేశ్యామ్’ విడుద‌ల‌కు సన్న‌ద్ధ‌మవుతోంది. దీని తర్వాత ప్రభాస్ సలార్ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ప్ర‌భాస్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌లో విజ‌య్ క‌ర‌గందూర్ ప్యాన్ ఇండియా మూవీగా ‘సలార్’ను నిర్మిస్తోన్న‌ సంగతి తెలిసిందే.

ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ను గోదావ‌రి ఖ‌నిలో చిత్రీక‌రించారు. కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌తో ఈ షెడ్యూల్ సోమ‌వారం పూర్త‌య్యింది. త‌దుప‌రి షెడ్యూల్ ఎక్క‌డ‌నే సంగ‌తి త్వ‌ర‌లోనే యూనిట్ ప్లాన్ చేస్తుంది. ప్ర‌భాస్‌ నాలుగు నెలల పాటు ‘సలార్’ కోసం డేట్స్‌ను కేటాయించాడట. మే చివరి నాటికంతా ‘సలార్’ షూటింగ్‌ను పూర్తి చేసేలా యూనిట్ ప్లాన్ చేసిందట. శ్రుతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో దీపికా ప‌దుకొనె ఐటెమ్ సాంగ్ చేసే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. మరో వైపు ప్రభాస్.. ఓం రావుత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్‘ సినిమా చిత్రీకరణలో పాల్గొనాల్సి ఉంది. రీసెంట్‌గా ప్రారంభమైన ‘ఆదిపురుష్’ సెట్స్‌లో ఆగ్ని ప్రమాదం జరిగింది. మరి ఓం రావుత్ షెడ్యూల్‌ను ఎలా ప్లాన్ చేస్తాడో చూడాలి మరి.

More News

ఉప్పెన' క్లైమాక్స్ ట్రోల్స్ పై వైష్ణవ్ తేజ్ స్పందన

ఉప్పెన ప్రీ-రిలీజ్ ఫంక్షన్ జరగడానికి రెండు మూడు రోజుల ముందు నుంచి సోషల్ మీడియాలో సినిమా క్లైమాక్స్ గురించి విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో ప్రమాదకరమైన సన్నివేశం ఒకటుందనీ

నెటిజన్‌ కామెంట్‌కు దిమ్మదిరిగేలా 'రంగమ్మత్త' రిప్లయ్!

సినిమా సెలబ్రిటీలపై.. మరీ ముఖ్యంగా నటీమణులపై నిత్యం ఎవరో ఒకరు విమర్శించడం.. సోషల్ మీడియా వేదికగా అసభ్యంగా కామెంట్స్ చేయడం కొందరు నెటిజన్లకు షరామామూలైపోతోంది.

హీరో సూర్య‌కి క‌రోనా పాజిటివ్‌

హీరో సూర్య‌కి కోవిడ్ పాజిటివ్‌గా నిర్దార‌ణ అయ్యింది. ఈ విష‌యాన్ని ఆయ‌నే త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు.

‘స‌లార్’ కోసం బాలీవుడ్ బ్యూటీ ఐటెం సాంగ్‌...

రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ ఇప్పుడు వ‌రుస‌గా ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ‘రాధేశ్యామ్‌’ సినిమా షూటింగ్ ముగింపు ద‌శ‌లో ఉండ‌గా ..

పోర్న్ వీడియో రాకెట్‌లో అరెస్ట్ అయిన హీరోయిన్‌...!

హిందీ, తెలుగు చిత్రాల్లో న‌టించిన న‌టి, మోడ‌ల్ గెహ‌నా వ‌శిష్ట్‌ను ముంబై పోలీసులు పోర్న్ కేసులో అరెస్ట్ చేశారు.