అఫీషియల్: ఎన్టీఆర్ చిత్రాన్ని ఇలా ప్రకటించిన ప్రశాంత్ నీల్
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్టీఆర్ బర్త్ డే రోజున అభిమానులకు వరుసగా సర్ ప్రైజ్ లు ఎదురవుతున్నాయి. కొమురం భీం లుక్ తో మొదలైన ఎన్టీఆర్ బర్త్ డే హంగామా ఇంకా కొనసాగుతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ తదుపరి చిత్రాలపై పూర్తి క్లారిటీ వచ్చేసింది. ఎన్టీఆర్ 30 కొరటాల శివ దర్శత్వంలో తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్ట్ ని ఇదివరకే ప్రకటించారు.
తాజాగా మరో పెద్ద ప్రకటన వచ్చింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకునే అనౌన్స్ మెంట్ ఇది. కెజిఎఫ్ తో దేశం దృష్టిని ఆకర్షించిన ప్రశాంత్ నీల్ దర్శత్వంలో ఎన్టీఆర్ 31వ చిత్రం ఉండబోతోంది. ఈ విషయాన్ని ప్రశాంత్ నీల్ స్వయంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. 'ఎవరైతే రక్తంలో మునుగుతారో ఆ నేల మాత్రమే గుర్తుంచుకోదగినది'. వన్ అండ్ ఓన్లీ ఫోర్స్ ఎన్టీఆర్ తో ప్రారంభించేందుకు ఎదురుచూడలేకున్నా' అని ప్రశాంత్ నీల్ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ 31 హ్యాష్ ట్యాగ్ తో జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు.
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ గురించి గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో మహేష్ బాబుతో కూడా ప్రశాంత్ ప్రాజెక్ట్ ఉండబోతోంది అంటూ వార్తలు వచ్చాయి. దీనితో ప్రశాంత్ నీల్ ముందుగా ఎవరితో ప్రారంభిస్తాడు అనే అనుమానం అభిమానుల్లో ఉండేది. తాజాగా ప్రకటనతో అది క్లియర్ అయిపోయింది.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ కంప్లీట్ కాగానే ఎన్టీఆర్ 31 ప్రారంభం కానుంది.
The only soil that is worth remembering is the one soaked in blood!!
— Prashanth Neel (@prashanth_neel) May 20, 2021
Cant wait to make this one with the one and only force @tarak9999#NTR31 it is!!
Wishing you a safe birthday brother ??
Wishing for a successful collaboration @MythriOfficial @NTRArtsOfficial.#HappyBirthdayNTR pic.twitter.com/jtfYbZ1LCE
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments