కేసీఆర్ రాజకీయాలల్లో కీలకంగా ప్రకాశ్ రాజ్.. సడెన్‌గా ప్రశాంత్ కిషోర్ పక్కన ప్రత్యక్షం
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ రాజకీయ వ్యవహారాల్లో ఈ మధ్య సినీనటుడు ప్రకాశ్ రాజ్ కనిపిస్తుండటం సినీ, రాజకీయ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. మొన్నామధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేను కలిసేందుకు కేసీఆర్ వెళ్లినప్పుడు కూడా ప్రకాశ్ రాజ్ ఉండటం తెలుగు ప్రజలను విస్మయానికి గురిచేసింది. తాజాగా ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పక్కన ప్రకాశ్ రాజ్ తళుక్కున మెరిశారు. ఆదివారం సినీనటుడు ప్రకాష్‌రాజ్‌తో కలిసి మల్లన్నసాగర్, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను తన టీమ్‌తో కలిసి పరిశీలించారు ప్రశాంత్ కిషోర్. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు వ్యూహాలు రచిస్తోన్న కేసీఆర్ అందుకు అనుగుణంగా పీకే టీమ్‌తో గ్రౌండ్ వర్క్ చేయిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఇప్పటికే కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్‌లో పర్యటించిన పీకే అండ్ టీమ్.. కేసీఆర్, తెలంగాణ పథకాలు ఫోకస్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో కీలకంగా వ్యవహరిస్తున్న నటుడు ప్రకాష్‌రాజ్ శనివారం ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. సుమారు నాలుగు గంట పాటు సాగిన ఈ భేటీలో జాతీయ రాజకీయాలపై చర్చించారు. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ కిషోర్ ఆదివారం తెలంగాణకు రావడం చర్చనీయాంశంగా మారింది. పీకే టీమ్ తెలంగాణలో క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసుకున్న నేపథ్యంలోనే ఈ భేటీ జరిగినట్లు పొలిటికల్ వర్గాల టాక్. రాష్ట్రంలో అభివృద్ధి ఏ మేరకు జరిగింది, ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు ఈ సర్వే చేపట్టనుంది.
ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో టీఆర్ఎస్ ఇప్పటినుంచి అందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తోంది. ఏయే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందనే విషయాలపై నిఘా వర్గాల నివేదికలు, వివిధ సర్వేల ద్వారా కేసీఆర్ గమనిస్తూనే ఉన్నారు. దీని ఆధారంగానే మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరును అంచనా వేస్తున్నారు. తాజాగా ప్రశాంత్ కిషోర్ టీమ్ చేసే సర్వే ఫలితాలను బట్టి కేసీఆర్ మరిన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com