Prasanna Vadanam:ఆ వ్యాధితో బాధపడుతున్న సుహాస్‌.. ఆకట్టుకుంటున్న 'ప్రసన్నవదనం' టీజర్

  • IndiaGlitz, [Thursday,March 07 2024]

షార్ట్ ఫిలిమ్స్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎదిగి ఇప్పుడు హీరోగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు సుహాస్. తన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే కలర్ ఫొటో, రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజి బ్యాండు వంటి సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టాడు. మధ్యలో హిట్‌2 చిత్రంలో విలన్ పాత్రలోనూ నటించి మెప్పించాడు. తాజాగా 'ప్రసన్న వదనం' అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌గా.. తాజాగా మూవీ టీజ‌ర్ విడుద‌ల చేశారు మేకర్స్.

ఇక టీజర్ ఆద్యంతం ఆసక్తిగా ఉంది. ఈ సినిమాలో ఫేస్ బ్లైండ్‌నెస్ అనే వ్యాధితో హీరో బాధపడుతుంటాడు. ఈ వ్యాధి వ‌చ్చిన వారు ఒక వ్యక్తికి సంబంధించి మొహం తప్ప అన్ని గుర్తుప‌డ‌తారు. అయితే ఈ వ్యాధి ఉన్న హీరోకు అకోకుండా ఒక స‌మ‌స్య ఎదుర‌వుతుంది. ఆ సమస్య నుంచి ఎలా బయటపడ్డాడు అనేది సినిమా స్టోరీ. టీజర్ చూస్తుంటే సినిమా క్రైమ్‌ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టీజర్‌ ట్రెండింగ్‌లో ఉంది.

ఈ మూవీలో పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్‌గా.. వైవా హర్ష, నితిన్ ప్రసన్న, సాయి శ్వేతా, తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. అర్జున్ వైకే అనే కొత్త దర్శకుడు ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నాడు. లిటిల్ థాట్స్ సినిమాస్, అర్హ మీడియా బ్యాన‌ర్‌పై మణికంఠ JS, ప్రసాద్ రెడ్డి TR సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్‌గా హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో సుహాస్ రెమ్యునరేషన్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. వరుస సక్సెస్‌లు వస్తుండటంతో రెమ్యునరేషన్ పెంచారని వార్తలు వస్తున్నాయి నిజమేనా..? అని అడిగారు.

ఇందుకు సుహాస్ సమాధానమిస్తూ.. అవును పెంచాను. ఏ నేను బతకొద్దా? జూనియర్ ఆర్టిస్ట్‌గా రోజుకు 100 రూపాయలు తీసుకునే దగ్గర్నుంచి ఇప్పుడు హీరోగా కష్టపడి ఎదిగాను, రెమ్యునరేషన్ పెంచడంలో తప్పులేదు అన్నారు. అయితే రూ.3000 నుంచి రూ.3కోట్ల వరకు ఎదిగారు అని టాక్ వినిపిస్తుంది అని అడగగా 1000 రూపాయల నుంచి రూ.3కోట్లు అనుకో.. మరీ అంత తీసుకోవట్లేదు అన్నారు. దీంతో సుహాస్ రెమ్యునరేషన్ పెంచారనే వార్తలు నిజమయ్యాయి. అయితే కోటి రూపాయల పైనే ఒక్కో సినిమాకు తీసుకుంటున్నట్లు సమాచారం.

More News

Pawan Kalyan:వైసీపీ మళ్లీ గెలిస్తే రాయలసీమలో ఇంకేమీ మిగలదు: పవన్ కల్యాణ్‌

రాయలసీమ ఐదుగురు నేతల కబంధహస్తాల్లో ఇరుక్కుపోయిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

CM Jagan:కార్లను మార్చినట్లు భార్యలను మారుస్తాడు.. పవన్ కల్యాణ్‌పై సీఎం జగన్ ఫైర్..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పెళ్లిళ్లపై మరోసారి సీఎం జగన్ వ్యాఖ్యానించారు. కార్లను మార్చినట్టు భార్యలను మార్చుతారని విమర్శించారు.

Record Break: 'రికార్డ్ బ్రేక్' ప్రీమియర్ షోలకు వచ్చిన స్పందన చూసి సంతోషంగా ఉంది: చదలవాడ

సీనియర్ నటి జయసుధ కుమారుడు నిహార్ కపూర్ హీరోగా నటించిన 'రికార్డ్ బ్రేక్' సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 8న విడుదలకానంది.

YS Sharmila:అందుకే ఏపీ రాజకీయాల్లోకి వచ్చాను.. కంటతడి పెట్టిన వైయస్ షర్మిల..

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఊపిరి లాంటిదని.. అలాంటిది తల్లి లాంటి ఏపీని జగనన్న వెన్నుపోటు పొడిచారని ఏపీసీసీ చీఫ్‌ వైయస్ షర్మిల విమర్శించారు.

Vasireddy Padma:మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామా.. ఎందుకంటే..?

ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. సీఎం జగన్‌కు అత్యంత నమ్మకస్తురాలైన వాసిరెడ్డి పద్మ మహిళా కమిషన్ చైర్మన్ పదవికి జీనామా చేశారు.