సినీ లవర్స్‌కి బ్యాడ్ న్యూస్: ‘‘ప్రసాద్స్ ’’ మల్టిప్లెక్స్ ఇక నుంచి ఐమాక్స్ కాదు.. ఎందుకంటే?
Send us your feedback to audioarticles@vaarta.com
హైదరాబాద్.. వందల ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం. మహ్మద్ కులీకుతుబ్ షా నిర్మించిన ఈ భాగ్యనగరంలో ఎన్నో టూరిస్ట్ స్పాట్లు. గోల్కండ కోట, చార్మినార్, కుతుబ్ షాహి టాంబ్స్, ఫలక్‌నుమా ప్యాలెస్, రామోజీ ఫిల్మ్ సిటీ, నెక్లెస్ రోడ్, సాలర్జంగ్ మ్యూజియం ఇలా ఎన్నో వున్నాయి. అయితే నగరానికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చిన ‘‘ప్రసాద్ ఐ మ్యాక్స్’’ కూడా వీటిలో ఖచ్చితంగా వుంటుంది. హైదరాబాద్‌కు ఎవరొచ్చినా ప్రసాద్స్‌లో సినిమా చూడనిదే వెళ్లరు.
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఐమాక్స్ 3D స్క్రీన్. ఐమాక్స్ ఫార్మాట్లో అతిపెద్ద స్క్రీన్ మీద సినిమాలను ప్రదర్శించిన మొట్టమొదటి ఐమాక్స్ స్క్రీన్.. ప్రసాద్స్ మల్టిప్లెక్సే. అయితే ఇక నుంచి ఐమాక్స్ ఎక్సపీరియన్స్ ప్రేక్షకులకు అందుబాటులో ఉండదట. ఐమాక్స్ అనలాగ్ ప్రొజెక్టర్ ద్వారా గతంలో ప్రసాద్ మల్టిప్లెక్స్‌లో ఐమాక్స్ ప్రింట్(రీల్)ను ప్రొజెక్ట్ చేసి సినిమాను ప్రదర్శించేవారు. కానీ.. ఇప్పుడంతా డిజిటలైజేషన్ . గతంలో మాదిరి రీల్స్ లేవు. సినిమాలను తీసేది కూడా డిజిటల్ ఫార్మాటే కావడంతో.. రిలీజ్ కూడా డిజిటల్‌గా మారిపోయింది.
ఐమాక్స్ స్క్రీనింగ్‌ను ఇప్పుడు ప్రసాద్ మల్టిప్లెక్స్ సపోర్ట్ చేయడం లేదు. అయితే మారుతున్న కొత్త జనరేషన్‌కు తగినట్లుగా ప్రసాద్స్ మల్టిప్లెక్స్‌ను సరికొత్తగా తీర్చిదిద్దారు. ఐమాక్స్ స్క్రీన్ లేకున్నా.. ఇతర లార్జ్ స్క్రీన్ల మీద కొత్త సినిమాలను ప్రదర్శిస్తున్నారు. తెలుగుతో పాటు హాలీవుడ్ సినిమాల వరకు ఏదైనా ఇక్కడ విడుదల అవుతున్నాయి. హైదరాబాద్‌లో అప్పటికీ, ఇప్పటికీ ఎన్నో మల్టిప్లెక్స్‌లు వచ్చినా నేటీకి సినీ ప్రియులు ప్రసాద్స్‌లో సినిమా చూడడానికి ఎగబడుతున్నారంటే దాని క్రేజ్ అర్దం చేసుకోవచ్చు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments