ప్రసాద్ ఐమాక్స్ యాజమాన్యంపై జీఎస్టీ కమిషనరేట్ కన్నెర్ర!
- IndiaGlitz, [Saturday,February 02 2019]
2019 జనవరి 1 మంగళవారం నుంచి సినిమా టికెట్ ధరలు తగ్గించాలని జీఎస్టీ కమిషనరేట్ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. గత జీఎస్టీ కౌన్సిల్‌లో సమావేశంలో వంద రూపాయిలకు మించి ఉన్న సినిమా టికెట్ల ధరపై 28 శాతం పన్ను నుంచి 18కు తగ్గించడం జరిగింది. అయితే నాటి నుంచి నేటి వరకూ హైదరబాద్‌లోని పలు సినిమా హాల్స్ యాజమాన్యం, మల్టిఫ్లెక్స్ యాజమాన్యం అంతా ఇష్టం అంటూ టికెట్ ధరలు తగ్గించి ఇష్టారీత్యా వసూలు చేస్తూనే ఉన్నారు.
దీంతో పలువురు సినీ ప్రియులు జీఎస్టీ కమిషనరేట్‌కు ఫిర్యాదు చేయడంతో అధికారులు రంగంలోకి దిగారు. అసలేం జరుగుతోంది..? సినిమా హాళ్లు, మల్లిఫ్లెక్స్ యాజమాన్యం తగ్గింపు ధరలకు అమ్ముతున్నారా..? లేదా..? అని జీఎస్టీ కమిషనరేట్ అధికారుల బృందం విచారించింది. ఈ విచారణలో పలు సినిమా హాళ్ల యాజమాన్యం ఇష్టానుసారం టికెట్ ధరలు వసూలు చేయడం ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసింది.
కాగా.. ప్రసాద్ ఐమాక్స్ యాజమాన్యం టికెట్ ధరలు తగ్గించకుండానే పాతధరలకు టికెట్లు అమ్మడాన్ని కమిషనరేట్ గుర్తించింది. పక్కా ఆధారాలతో సహా కేసు నమోదు చేసిన అధికారులు ‘యాంటీ ప్రొషెటిరింగ్ సంస్థ’కు అప్పగించడం జరిగింది. జీఎస్టీ యాక్ట్ 2017, సెక్షన్ 171 కింద కేసు నమోదు చేస్తున్న్లు ఓ ప్రకటనలో కమిషనరేట్ స్పష్టం చేసింది. అయితే ఈ కేసులో ఐమాక్స్ యాజమాన్యంపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు..? ఈ చిక్కుల నుంచి యాజమాన్యం ఎలా బయటపడుతుంది..? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మున్ముంథు ఇలాగే పాత ధరలకే టికెట్లు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జీఎస్టీ కమిషనరేట్ మిగిలిన సినిమా హాళ్లు, మల్టీఫ్లెక్స్ యాజమాన్యాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.