రామ్ జోడిగా ప్రణీత..
Send us your feedback to audioarticles@vaarta.com
ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం దిల్రాజు బ్యానర్లో త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో ఓసినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `ఉన్నది ఒక్కటే జిందగీ` సినిమా తర్వాత రామ్ రెండు సినిమాల్లో నటిస్తున్నారు. అందులో త్రినాథరావు సినిమా ఒకటి. ఇది మామ, అల్లుడు మధ్య జరిగే టామ్ అండ్ జెర్రి ఫైట్లాంటి చిత్రం.
ఈ చిత్రంలో మామ పాత్రలో రావు రమేశ్ నటిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాలో మరో హీరోయిన్గా ప్రణీత సుభాస్ నటిస్తుంది. బ్రహ్మోత్సవం సినిమా తర్వాత తెలుగు సినిమాలల్లో ప్రణీత నటించలేదు. రెండేళ్ల తర్వాత మరోసారి ప్రణీత తెలుగు తెరపై సందడి చేయనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com