రామ్ జోడిగా ప్ర‌ణీత‌..

  • IndiaGlitz, [Wednesday,April 11 2018]

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ ప్ర‌స్తుతం దిల్‌రాజు బ్యాన‌ర్‌లో త్రినాథ రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో ఓసినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. 'ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ'  సినిమా త‌ర్వాత రామ్ రెండు సినిమాల్లో న‌టిస్తున్నారు. అందులో త్రినాథ‌రావు సినిమా ఒక‌టి. ఇది మామ‌, అల్లుడు మ‌ధ్య జ‌రిగే టామ్ అండ్ జెర్రి ఫైట్‌లాంటి చిత్రం.

ఈ చిత్రంలో మామ పాత్ర‌లో రావు ర‌మేశ్ న‌టిస్తాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. సినిమాలో అనుప‌మ ప‌రమేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమాలో మ‌రో హీరోయిన్‌గా ప్ర‌ణీత సుభాస్ న‌టిస్తుంది. బ్ర‌హ్మోత్స‌వం సినిమా త‌ర్వాత తెలుగు సినిమాలల్లో ప్ర‌ణీత న‌టించ‌లేదు. రెండేళ్ల త‌ర్వాత మ‌రోసారి ప్ర‌ణీత తెలుగు తెర‌పై సంద‌డి చేయ‌నుంది.