'ప్రణయ్’ మళ్లీ పుట్టాడు.. ఆందోళనలో అమృత!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యావత్ భారతదేశంలో సంచలనం సృష్టించిన నల్లొండ జిల్లా మిర్యాలగూడ ‘పరువు హత్య’ అందరికీ గుర్తుండే ఉంటుంది. 24 ఏళ్ల యువకుడు పెరుమాళ్ల ప్రణయ్, గర్భంతో ఉన్న తన భార్య అమృతను ఆస్పత్రికి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా ఓ దుండగుడు మాటువేసి అతి కిరాతకంగా హత్య చేశాడు. కాగా.. అమృత.. గురువారం మధ్యాహ్నం మిర్యాలగూడలోని ఓ ఆస్పత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు ఆమె అత్తామామలు తెలిపారు.
హత్యానంతరం మీడియాతో మాట్లాడుతూ.. తన కడుపులో ప్రణయ్ ప్రతిరూపం పెరుగుతోందని.. ఆ బిడ్డకు జన్మనిచ్చి ప్రణయ్‌ని చూసుకుంటానని తీవ్ర భావోద్వేగంతో చెప్పిన సంగతి తెలిసిందే. తనకు బిడ్డ పుట్టే లోపు ఈ హత్యకు కారకులైన వారందర్నీ ఉరితీయాలని పోలీసులను డిమాండ్ ఆమె డిమాండ్ చేసింది. అయితే ముందుగా అనుకున్నట్లుగానే అమృతకు ‘ప్రణయ్’ పుట్టాడు. దీంతో అమృత అత్తగారి ఫ్యామిలీ భావోద్వేగానికి గురై... కాసింత ఆందోళన వ్యక్తం చేశారు.
నా బిడ్డనూ చంపుతారేమో.. ఆందోళనలో అమృత!
ప్రణయ్‌ను చంపిన వాళ్లే తన బిడ్డను కూడా చంపుతారేమోనని అమృత ఆందోళన వ్యక్తం చేస్తోంది. మేమిద్దరం స్కూల్‌లో చదివేటప్పుడు ప్రేమించుకున్నామని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ఈ విషయాలన్నీ తెలిసిన మా నాన్న, బాబాయి కలిసి ఇంతటి కిరాతకానికి ఒడిగట్టారని మీడియా ముందు అమృత కంటతడిపెట్టింది. కాగా.. ప్రణయ్ హత్య కేసులో అమృత తండ్రి మారుతీరావును ఏ1గా, అతని తమ్ముడు శ్రవణ్‌ను ఏ2గా పేర్కొంటూ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments