భ‌ర‌త‌నాట్యం బ్యాక్ డ్రాప్ లో 'ప్రణవం'

  • IndiaGlitz, [Wednesday,January 09 2019]

చరిత అండ్‌ గౌతమ్‌ ప్రొడక్షన్స్‌ పతాకం పై ‘ఈ రోజుల్లో’ శ్రీ మంగం, శశాంక్‌, అవంతిక హరి నల్వా, గాయత్రి అయ్యర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో కుమార్‌ జి. దర్శక‌త్వంలో తను.ఎస్‌ నిర్మిస్తోన్న చిత్రం ‘ప్రణవం’. ఈ చిత్రం షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది

ఈ సందర్భంగా దర్శకుడు కుమార్‌.జి చిత్ర విశేషాలు తెలియజేస్తూ... ‘‘ఇప్పటికే మా సినిమాకు సంబంధించిన షూటింగ్‌ పార్ట్‌ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. చండీఘర్‌కు చెందిన మోడల్‌ అవంతిక హరి నల్వా హీరోయిన్‌గా నటిస్తుండగా, గాయత్రి అయ్యర్ మ‌రో ముఖ్య భూమిక‌లో నటిస్తోంది. భ‌ర‌త‌నాట్యం నేప‌థ్యంలో ల‌వ్‌ ,సస్పెన్స్‌ తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాం.

అన్ని వర్గాల ప్రేక్షకుల‌కు నచ్చే సినిమా అవుతుంద‌న్న‌న‌మ్మ‌కంతో ఉన్నాం. అలాగే మా సినిమాకు మ్యూజిక్ ప్రధాన ఆకర్షణగా నిల‌వనుంది. ఆర్‌.పి.పట్నాయక్‌గారు, ఉష గారు కలిసి ఒక డ్యూయెట్ మా సినిమాలో ఆల‌పించారు. త్వరలో ఆడియో రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం. ఫ్రెష్ కాన్సెప్ట్ తో యంగ్ టీమ్ అంతా కలిసి చేస్తోన్న మా ప్ర‌య‌త్నాన్ని ప్రేక్ష‌కులు ఆశీర్వదిస్తార‌ని కోరుకుంటున్నాం’’ అన్నారు.

జెమిని సురేష్‌, నవీన, జబర్దస్త్‌ బాబి, దొరబాబు, సమీర, తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి పిఆర్వో: వంగాల‌ కుమార స్వామి; స్టిల్స్‌: శశాంక్‌ శేఖర్‌; డిఓపి: మార్గల్‌ డేవిడ్‌; కొరియోగ్రాఫర్‌: అజయ్ శివ‌శంక‌ర్‌; కో-డైరక్టర్‌: శ్రావణ్ న‌ల్లూరి; సంగీతం: పద్మనావ్‌ భరద్వాజ్‌; ఎడిటర్‌: సంతోష్‌; ఫైట్స్‌: దేవరాజ్‌; లిరిక్స్‌: కరుణాకర్‌, సిహెచ్‌ విజయ్‌కుమార్‌, రామాంజనేయులు; నిర్మాత: తను.ఎస్‌; కో- ప్రొడ్యూసర్స్‌: వైశాలి, అనుదీప్‌; దర్శకత్వం: కుమార్‌.జి.

More News

చరిత్ర సృష్టించిన వైఎస్ జగన్..

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం స్వతహాగా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అనే ఒక కొత్తపార్టీని (వైఎస్సార్సీపీ)

ఏప్రిల్ 18 న విడుద‌ల‌కానున్న రాఘ‌వ లారెన్స్  'కాంచ‌న‌-3'

ముని, కాంచ‌న‌, కాంచ‌న‌-2 తో హ‌ర్ర‌ర్ కామెడి చిత్రాల్లో సౌత్ ఇండియాలోనే హ్య‌జ్ స‌క్స‌స్ ని సాధించిన రాఘ‌వ లారెన్స్ హీరోగా, ద‌ర్శ‌కుడిగా ముని ప్రాంచాయిస్ నుండి వ‌స్తున్న హ‌ర్ర‌ర్ కామెడి చిత్రం కాంచ‌న‌-3

పార్టీ మార్పుపై టీడీపీ ఎమ్మెల్యే ఫైనల్ ప్రకటన

తెలంగాణ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

వైసీపీలోకి వెళ్దామంటూ టీడీపీ ఎంపీపై కుమార్తె ఒత్తిడి!

గత కొద్దిరోజులుగా టీడీపీలో జరుగుతున్న పరిణామాలతో విసిగివేశారిపోయిన ఆ ఎంపీ కుమార్తె..

కోడికత్తి కేసులో వైసీపీ మొదటి విజయం!

వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో వైసీపీ మొదటి విజయం సాధించింది.